koodali

Wednesday, March 14, 2018

కొన్ని విషయములు....



ఈ మధ్య మేము ఊరు వెళ్ళి వచ్చాము. 

******************
స్వాతంత్య్రం  వచ్చి చాలా  సంవత్సరాలు గడచినా  కూడా  .... సమాజంలో నిత్యావసరాలు తీరని వారు ఎందరో ఉన్నారు.

 ఆహారం,ఆవాసం, వైద్యం..వంటి నిత్యావసరాలు తీరటం ఎంతో ముఖ్యం.

 పేదవారికి తక్కువ ధరలకే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని క్యాంటీన్ల ద్వారా అందిస్తే బాగుంటుంది. 

మన పెద్దవాళ్లు కూడా అన్నదానం ఎంతో గొప్పదని తెలియజేసారు. 

ఉచితంగా కాకపోయినా , తక్కువధరకు ఆహారాన్ని అందించగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 
..................

ఇక , ఉండటానికి  నిలువనీడలేక ఫుట్ పాత్లపై కాలం గడుపుతున్నవారూ ఎందరో ఉన్నారు.ఇలాంటి వారికి ఆవాసం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 

 కొన్ని నగరాలలో ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయంటారు. ఇలాంటి చోట్ల నామమాత్రము రుసుము తీసుకుని  ముఖ్యంగా రాత్రి సమయంలో ఉండటానికి  ఏర్పాటు ఉందట.

 ఈ విధానాన్ని మెరుగుపరిచి కొన్ని మార్పులుచేర్పులు చేసి పేదవారికి కొంత నీడను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

 ఇలాంటి చోట్ల ఉచిత వైద్య సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
...................

ఇవన్నీ చేయటానికి  బోలెడు డబ్బు ఖర్చు అవదు. ఒకవేళ డబ్బు ఖర్చు అయినా కూడా ఫరవాలేదు. 

  ఎన్నో పధకాలు ఉన్నాకూడా,  దేశంలో  పేదరికం ఇంకా  పోలేదు . ఇందుకు  ఎందరో బాధ్యులు.

పేదలు అగచాట్లు పడకుండా ఆహారం, ఆవాసం, వైద్యం...ఏర్పాటు చేస్తే  పేద వాళ్లు కూడా ఉన్నత స్థానానికి ఎదగటానికి ఉపయోగపడుతుంది.

(Friday, July 3, 2015

నిత్యావసరాలు తీరటం ముఖ్యం...)

 ****************
భారతదేశం ఇలా కావడానికి చాలామంది బాధ్యులు. రాజకీయులు, అధికారులు, ప్రజలు వీళ్ళలో మంచి వాళ్లు ఉన్నారు కానీ ,  స్వార్ధపరులు చాలామందే ఉన్నారు.  

 చాలామందిలో  స్వార్ధం పెరిగిపోయిన ఈ రోజుల్లో దేశం ఇలా కాకుండా ఎలా ఉంటుంది.

 

No comments:

Post a Comment