koodali

Monday, October 2, 2017

మొక్కులు తీర్చగలమో ? లేదో? ..మరికొన్ని విషయాలు..

 
 
కొందరు కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు.

 ఉదా..కష్టాలు తీరితే,  ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను ..అని మొక్కుకుంటారు. 

అయితే, ఆ మొక్కులు తీర్చటం కొన్నిసార్లు సులభంగా సాధ్యం కాకపోవచ్చు. 


గభాలున ఎన్నో  అనుకోవటం .. ఆ తరువాత ఆలోచించటం కన్నా.. ముందే ఆలోచించుకోవటం మంచిది. 


ఎన్ని కష్టాలు వచ్చినా, క్లిష్టమైన మొక్కులు మొక్కుకోవటం కన్నా.. దైవప్రార్ధన చేసుకోవటం మంచిది. 


ఇంకా, సమాజానికి తనకు చేతనైనంత మంచిపనులు చేయవచ్చు. 


*********************
అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు కొన్ని జరుగుతుంటాయి. 

ఉదా..దేవాలయానికి వెళ్తూ దారిలో పువ్వులు, పండ్లు కొందామనుకుని,  దేవాలయం వద్ద కొనవచ్చులే.. అని దేవాలయం వద్దకు వెళ్లిన తరువాత చూస్తే అక్కడ మనం కొనాలనుకున్న పువ్వులు, పండ్లు ఉండకపోవచ్చు. 

అప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనలేకపోవచ్చు. ఇలాంటప్పుడు సంశయంగా ఉంటే కొంత సొమ్మును హుండీలో సమర్పించవచ్చు లేక క్షమించమని దైవాన్ని ప్రార్ధించవచ్చు. 

ఉదా.. ఎప్పట్నించో చేయాలనుకున్న పూజ చేయాలనుకుని , అన్నీ సిద్ధం చేసుకుని పూజ తరువాత..హమ్మయ్య.. ఇప్పటికి పూజ పూర్తిచేయగలిగాం.. అనుకున్నప్పుడు, 

తరువాత తెలుస్తుంది. దూరపు బంధువు మరణించిన విషయం, అదే సమయంలో పూజ చేసామని. 

అలాంటప్పుడు పూజ చేయటం జరిగిందని తెలిసినప్పుడు సంశయం అనిపిస్తుంది. 

ఇంతకీ పూజ చేసిన ఫలితం లభిస్తుందా ? లేదా ? తిరిగి పూజ చేయాలా ? వంటి అనేక సందేహాలు కలగవచ్చు. తిరిగి అలా పూజ చేయాలంటే కష్టం కావచ్చు. 

కొందరేమంటారంటే , మళ్లీ పూజ చేయాలంటారు. 

కొందరేమో అవసరం లేదు , బంధువుల మరణం గురించి మీకు తెలియక పూజ చేశారు కాబట్టి, తిరిగి పూజ చేయనవసరం లేదంటారు.  ఎన్నో సందేహాలుంటాయి. 

కొన్ని సంవత్సరాల క్రిందట నాకు ఇలాంటి సంఘటన అనుభవంలోకి వచ్చింది. ఇలాంటివి గమనిస్తే ఏమనిపిస్తుందంటే,  

కొన్నిసార్లు మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఇంతే శక్తి ఉంది,  క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి అంతే.


మనం చేయాలనుకున్న పని చేయగలమో ? లేదో? తెలియదు. అందువల్ల, కుదిరితే..చేస్తాను..అనుకోవటం మంచిది.

 ప్రతిపనికీ ముందు అలా అనుకోవటం కష్టం కాబట్టి..ఒకేసారి అనేసుకోవచ్చు. జీవితంలో ఏ పనైనా.. కుదిరితే చేస్తాను.. అనుకోవచ్చేమో .. అనిపిస్తోంది.  


No comments:

Post a Comment