koodali

Friday, March 10, 2017

స్త్రీలు .. పురుషులు..సమాజం..మరికొన్ని విషయాలు ..

కొందరు ఏమంటున్నారంటే, స్త్రీలు ఎన్నో రంగాలలో ముఖ్యమైన స్థానాలలో ఉంటే సమాజం బాగుపడిపోతుంది అని భావిస్తున్నారు . 

అయితే, గత ఏభై సంవత్సరాల నుంచీ గమనిస్తే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు , మంత్రులు, ఎమ్మెల్యేలు..ఇంకా ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారాలలో స్త్రిలు  పని చేసారు, పనిచేస్తూనే ఉన్నారు.

మరి, చాలామంది స్త్రీలు ఎన్నో రంగాలలో  ముఖ్యమైన పాత్రల్లో ఉన్నా కూడా.. సమాజంలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి  కదా!స్త్రీల పట్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయనిపిస్తుంది. 


కొందరు స్త్రీలు ఏమంటున్నారంటే, అమ్మాయిలు, అబ్బాయిల పెంపకంలో తేడాలుండకూడదు,  అమ్మాయిలంటే  గౌరవం ఉండేలా అబ్బాయిలను పెంచాలి..అని డిమాండ్ చేస్తున్నారు.  అలాగే పెంచండి. ఎవరొద్దన్నారు ?


 తల్లి తన ఆడపిల్లలను, మగపిల్లలను సమానంగా పెంచి స్త్రీల పట్ల మర్యాదగా ఉండాలని అబ్బాయిలకు నేర్పించితే.. ..పెద్దయిన తరువాత అబ్బాయిలు అమ్మాయిలను గౌరవంగా చూస్తారు.


అమ్మాయిలు..అబ్బాయిలు  మధ్య సమానత్వం సంగతి అలా ఉంచితే..చాలామంది స్త్రీల మధ్యే  సహనం, సమానత్వం లేదు.

ఉదా.. కొందరు అత్తా, ఆడపడుచులు..ఇంటి కోడలిని వేధించటం..కొందరు కోడళ్ళు.. అత్తా,ఆడపడుచులను వేధించటం..ఇవన్నీ ఏమిటి ?

ఇక,  వివాహేతర సంబంధాల కేసులలో ..సాటి స్త్రీ కాపురాన్ని కష్టాలపాలు చేయటంలో వేరొక స్త్రీ పాత్ర కూడా ఉంటుంది కదా!

ఇంకో విషయం ఏమిటంటే , స్త్రీలు అందరూ మంచివాళ్ళు, పురుషులందరూ చెడ్దవాళ్ళు అనుకోవటం తప్పు.

 స్త్రీలలో కూడా కొందరు అవినీతిపనులు నేరాలు చేస్తున్నారు. అమ్మాయిలను మోసం చేసి వ్యభిచార గృహాలకు తరలించే కేసులలో కొందరు స్త్రీలు కూడా ఉన్న కేసుల గురించి వార్తలు వచ్చాయి.

 ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే ,  స్త్రీల కష్టాలకు  కొందరు పురుషులతో పాటు.. కొందరు స్త్రీలు కూడా కారణమే అని తెలుస్తుంది.

 స్త్రీలు అసూయ వల్ల..  తమలో తాము పోటీ పడుతూ ఉంటే మగవారి ముందు చులకన అయ్యే అవకాశం ఉంది.  తద్వారా స్త్రీల పట్ల మగవారి పెత్తనం పెరిగే అవకాశం వస్తుంది.
*************


స్త్రీలు  ఇంటాబయట పని నెత్తినేసుకుని పనిచేయటం గమనిస్తే..ఇది స్త్రీల  విజయం కాదు ... ఇది పురుషుల గెలుపుగా అనిపిస్తోంది.


పాతకాలంలో స్త్రీలు ఇంటిపట్టున ఉండేకాలంలో పురుషులు పరాయి స్త్రీలతో మాట్లాడాలన్నా కష్టంగా ఉండేది. ఈ రోజుల్లో స్త్రీలను వేధించటం కొందరు పురుషులకు సులువయ్యింది.
...............

 జీవితంలో డబ్బు సంపాదనా..అవసరమే..కుటుంబాన్ని  చక్కదిద్దుకోవటమూ ముఖ్యమే.
రెండూ ముఖ్యమైన బాధ్యతలే.
..............

  ఇక,  పిల్లల పెంపకంలో తల్లితండ్రి ఇద్దరికీ బాధ్యత ఉంటుంది. 

భర్త తన భార్యను గౌరవంగా చూస్తే.. భార్య సంతోషంగా ఉంటుంది. ఆమె తన పిల్లలను చక్కగా చూసుకుంటుంది.

ఎప్పుడూ గొడవపడే భర్త ఉన్న భార్య ఆ బాధ వల్ల పిల్లలను సరిగ్గా చూసుకోలేదు. భర్త భార్యను కొడితే ఆమె ఆ కోపంతో పిల్లలను కొట్టే అవకాశం ఉంది.

 పిల్లలను శారీరికంగా, మానసికంగా చక్కటి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించటం ఎంతో గొప్ప సమాజసేవ.

చక్కటి పౌరులు ఎక్కువగా ఉండే సమాజంలో సమస్యలూ తక్కువగానే ఉంటాయి.



No comments:

Post a Comment