koodali

Monday, December 29, 2014

హరిశ్చంద్రుని కధ చదివి..


హరిశ్చంద్రుని కధ చదివి.. సత్యం కోసం అన్ని కష్టాలు పడటం ఎందుకు ?  అనుకుంటున్న వాళ్ళూ ఈ సమాజంలో  ఉన్నారు.

చిన్న  అబద్ధమే కదా అనుకుంటే అదే అలవాటై ఒకరిని చూసి ఒకరు  అంతా అబద్ధాలే  చెబితే  సమాజంలో ఎన్నో గొడవలు మొదలవుతాయి. అసత్యం  విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి..మొదలే  దానిని అరికట్టాలి.       

( అయితే కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు అన్యాయంగా ప్రాణాలకు హాని కలిగే సమయాలలో అసత్యం చెప్పినా ఫరవాలేదని మినహాయింపును ఇచ్చారు పెద్దలు.. ఇలాంటి  సందర్భాలలో  విచక్షణ ప్రకారం నడుచుకోవాలని పెద్దలు సూచించారు.)

 సత్యం విలువ ఎంతో  గొప్పది.  రాజే  అసత్యవంతుడైతే, యధారాజా తధాప్రజా  అన్నట్లు ...సమాజం  అంతా అబధ్ధాలు, మోసాలతో  అస్తవ్యస్తమైపోతుంది.

 లోకహితం కోసం, లోకానికి సత్యం యొక్క విలువను తెలియజెప్పటం కోసం  హరిశ్చంద్రుడంతటి వారు ఎన్నో కష్టాలను సహించారు. నేను రాజును కదా, సత్యం కోసం ఎందుకు కష్టాలు పడాలి ? అని వారు అనుకోలేదు.

ఈ విషయం గురించి మరిన్ని  వివరాలను  చదవాలనుకుంటే  దయచేసి  ఈ  లింకుల  వద్ద  చదవగలరు..  

Saturday, December 27, 2014

పురాణేతిహాసాలలో అతిశయోక్తులు ..

 
పురాణేతిహాసాలలో  ఎన్నో  అతిశయోక్తులున్నాయని కొందరు ఎగతాళి  చేస్తుంటారు.  అలా అనుకోవటం  సరైనది  కాదు.

పురాణేతిహాసాలలో  భారీ  ఆకారాల  జీవుల  గురించి  తెలియజేసారు. దేవతలు .. పక్షులను,  జంతువులను తమ వాహనాలుగా  చేసుకోవటం  కూడా  చెప్పబడింది.

అంత  పెద్ద  పక్షులు  ఎక్కడయినా  ఉంటాయా ?  అని నేటికాలంలో కొందరు విమర్శిస్తారు.

 ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పిన  దానిప్రకారం  చూసినా   ప్రాచీన  కాలంలో  డైనోసార్స్  వంటి  భారీ  జీవులు ఉండేవని  అంటున్నారు.  ఆ కాలంలో  ఏనుగులు  వంటివి  కూడా  భారీ  ఆకారాలతో  ఉండేవని అంటున్నారు.

మరి, పురాణేతిహాసాలలో  భారీ ఆకారాల  జీవుల  గురించి  చెబితే మాత్రం  అతిశయోక్తులనటం  ఏం న్యాయం ? 
......................

 పురాణేతిహాసాల ద్వారా చూస్తే, ఆ కాలంలో  కొందరు  ఎంతో  శక్తి కలవారిగా  తెలుస్తుంది. బహుశా, ప్రాచీనులలో  కొందరికి ఎక్కువ శక్తిసామర్ధ్యాలు  ఉండి ఉండవచ్చు .

ఈ కాలంలో కూడా కొందరు..  లారీలను,  విమానాలను  ఒంటి  చేత్తో  లాగేస్తున్నారు. ఇలా వాహనాలను  సునాయాసంగా లాగేవారికి  ఆ బలం  ఎలా వస్తుందో  ఆధునిక సైన్స్  చెప్పలేకపోతోంది.

 ఇవన్నీ  గమనిస్తే  మనకు  తెలిసిదేమిటంటే, ఆధునిక  విజ్ఞానానికి  అంతుపట్టని  విషయాలెన్నో  విశ్వంలో  ఉన్నాయని తెలుస్తోంది.
...................

 పురాణేతిహాసాలలో  కొందరు ఆకాశానికి  ఎగరటం, నీటిపై  తేలటం  వంటి  శక్తులు  కలిగిఉండేవారంటే..అవన్నీ  అతిశయోక్తులని  అంటారు  కొందరు..

ఈ రోజుల్లో  కూడా  కొందరు  యోగ శక్తితో  నీటిపై మునగకుండా కూర్చుంటున్నారు.

ప్రాచీన  కాలంలో  ఇప్పటికన్నా  మించిన  విజ్ఞానం  ఉండిఉండవచ్చు.  అప్పటివారికి  ఇతర  గ్రహాల  జీవులతో సంబంధాలు  ఉండి  ఉండవచ్చు. 

 ఇతర  గ్రహాలపై  జీవం  ఉన్నదనీ,  వారు  మనకన్నా  విజ్ఞానవంతులు  కావచ్చనీ  నమ్మే  వాళ్ళు  ఎందరో  ఇప్పటివాళ్ళలో  ఉన్నారు.
.............................

 భూమిమీది  విషయాల  గురించే  మనకు  సరిగ్గా  తెలియదు.  ఇక  దైవం  గురించి, విశ్వం  గురించి  మనకు  అంతా  తెలుసు..  అని  అనుకోవటం  హాస్యాస్పదం.

 విశ్వరహస్యాల  గురించి  మనకు  తెలిసింది  సముద్రంలో  నీటిబొట్టంత.  తెలియనిది  సముద్రమంత. 

 మనకు  చేతనయితే  పురాణేతిహాసాలలోని  అద్భుతవిజ్ఞానం  గురించి  తెలుసుకోవాలి . అంతేకానీ  పురాణేతిహాసాలలో  ఉన్నవన్నీ  అతిశయోక్తులే అని అనుకోవటం అజ్ఞానం.
.............................

ఏదైనా  విషయం  గురించి  చెప్పేటప్పుడు  ఎదుటివారికి  ఆసక్తిగా ఉండటానికి  కొంత  అతిశయోక్తి  జోడించి  చెబుతుంటారు  కొందరు.  పురాణేతిహాసాలలో  కొన్ని  ప్రక్షిప్తాలు  కూడా ఉన్నాయంటారు.

 ఏవి  ప్రక్షిప్తాలో  మనకు  సరిగ్గా  తెలియదు.  అందుకని  పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకోవటం  మాని  సరిగ్గా  అర్ధం చేసుకోవటానికి  ప్రయత్నించాలి.


Saturday, December 13, 2014

సతీ సుమతి...మరి కొన్ని విషయాలు .విశ్లేషణ ..

 

 

సుమతీదేవి  ఎంతో  ఓపికతో, సహనంతో  తన  కాపురాన్ని  చక్కదిద్దుకుంది.ఆమె భర్త అనారోగ్యంతో  ఉండి కూడా  భార్యనే  కోరరాని  కోరిక  కోరాడు. 


  భార్య   అనుకూలవతి  అయినా  పర  స్త్రీల  పట్ల  మోజుపడే   వారు  ఉంటారు . 

  తన  ప్రియురాలి  వద్దకు    తీసుకెళ్ళమని  భార్యను  కోరాడు. ఏ  స్త్రీకయినా  ఇలాంటివి  తట్టుకోవటం  కష్టమే. 

 ఇలాంటి  భర్తను  కఠినంగా  శిక్షించాలని  చాలామంది   అంటారు . ఇలాంటివి  విన్నప్పుడు   అంతటి  బాధ  కలిగే  మాట  వాస్తవమే.   

అయితే,  వ్యసనపరుడైన  భర్తను  శిక్షించాలని  ఆవేశపడే  వాళ్ళు  తమ  పిల్లలు  లేక  అన్నదమ్ములు   వ్యసనపరులైనా  ఇలాగే  శిక్షించాలని కూడా అనగలరా ?

 శిక్షకన్నా   ముందు    నేరస్తులలో  పరివర్తన  తేవటానికి    ప్రయత్నించవచ్చు.

...............

 సుమతీ  సాధ్వి  తన  భర్త  కోరికను తీర్చటానికి  సిద్ధమవటానికి ఎంతటి  మానసిక  వ్యధను  అనుభవించిందో కదా !

  రోగిష్టి  అయిన  తన  భర్త  కోరికను  తీర్చటానికి   అతని  ప్రియురాలు    ఒప్పుకోదని  సుమతి  భావించి  ఉండవచ్చు.   ఆ  నమ్మకంతోనే  భర్తను  ఇతరుల  వద్దకు  తీసుకెళ్ళటానికి  ఒప్పుకుని  ఉండవచ్చు.
........................................


వ్యసనపరులను  మంచి  మార్గంలోకి  తేవాలంటే   ఎంతో  ఓర్పు,  నేర్పు ఉండాలి. ఈ  రోజుల్లో  వ్యసనపరులను  మార్చటానికి  సైకాలజిస్టుల వద్దకు  తీసుకువెళ్తున్నారు.

 వ్యసనపరులను  మార్చాలంటే  సైకాలజిస్టులు  కూడా  ఎంతో  సహనంతో   ప్రయత్నించవలసి  ఉంటుంది. సుమతి  ఎంతో  సహనంతో .... వ్యసనపరుడయిన  తన  భర్తను  తానే  సరిదిద్దుకుంది. 

....................
 
సుమతి ఎంతో  సహనంతో  తన  కాపురాన్ని  చక్కదిద్దుకుంది.  అందుకు  ఆమె   ఎంతో  అభినందనీయురాలు. ఆ విధంగా  సమాజానికి  ఒక  చక్కటి  మేలును  చేసింది.

సుమతి చేసిన  దానిలో  తప్పేమిటి ? ఎవరి ఇల్లును  వారు  సరిదిద్దుకుంటే దేశమే  బాగుపడుతుంది కదా!

  అయితే  ఇలా  సరిదిద్దటం  తేలికయిన  పనేమీ  కాదు.  అందుకు  ఎంతో  సహనం  అవసరం. 

  (  జీవితభాగస్వామి  మరీ  శాడిస్టు   అయినా  సర్దుకుపోవాలని  నా  అభిప్రాయం  కాదు. అయితే  ఈ  కాలంలో  కొందరు  జీవిత  భాగస్వామిలో  చిన్న  లోపాలున్నా  శాడిజం  అనేస్తున్నారు. అది  తప్పు.  ) 
..................... 

సుమతిలాంటి   అత్యంత  సహనశీలురకు   న్యాయం  చేయటానికి  సూర్యుడు , అనసూయాదేవి  వంటి   వారు  కూడా తమ  సహకారాన్ని  అందిస్తారు.
.......................

వ్యసనపరులను, చెడ్డపనులు   చేసేవారిని 
చెంపపగలగొట్టాలని కొందరు   అంటారు .అయితే, చెంపపగలగొట్టటం  వల్ల  మళ్ళీ   చెడ్డపనులను   చేయరని   నమ్మకమేమిటి ?

  రెచ్చిపోయిన  వాళ్ళు   మరింతగా   చెడ్డపనులను  చేసే  ప్రమాదం  కూడా  ఉంది.

అయితే ,  అలాగే  వదిలేస్తే  వారు  సమాజం  మీద  పడి  ఇతరులకు  హాని  చేసే  అవకాశం  
కూడా  ఉంది.

 అందుకని,   వారిని  మంచివారి గా  మార్చటానికి  ప్రయత్నించటంలో  తప్పులేదేమో...అనిపిస్తోంది.


ప్రయత్నించినా  మారకపోతే  అప్పుడు  కఠినంగా  శిక్షించవలసిందే.  


మరీ  క్రూరమైన  నేరాలను  చేసిన  వారి  విషయంలో  మాత్రం  వారిని  మార్చటానికి  ప్రయత్నించటం  కన్నా .....  వెంటనే  కఠినంగా  శిక్షించటమే  మంచిదనిపిస్తోంది.  


ఆ  శిక్షలు  ఎలా ఉండాలంటే, ఇతరులు  మళ్ళీ  తప్పు  చేయటానికి  భయపడేంత  కఠినంగా  శిక్షించాలి.  


నేరస్తులకు   కఠినశిక్షలు  వేసిన  తరువాత  ,  అటువంటివారు    తయారుకావటానికి    గల  మూల  కారణాలను  గుర్తించి   వ్యవస్థను   మార్చటానికి  ప్రయత్నించాలి.
.............................. 

మన  పూర్వీకులైన  భార్యాభర్తలు  ఇప్పటి  కాలపు  భార్యాభర్తలలా .......నా హక్కులే  నాకు  ముఖ్యం...అంటూ   విడిపోయి  ఉంటే  ఈ దేశంలో  కుటుంబవ్యవస్థ  ఎప్పుడో  మాయమై  ఉండేది. 
 ...................... 

   మనుషుల  మధ్య  ఎన్నో  భేదాభిప్రాయాలు  ఉంటాయి.  తల్లిబిడ్డల  మధ్య  కూడా   అభిప్రాయ  భేదాలు  వస్తుంటాయి.  ఎక్కడో  పుట్టిపెరిగిన  భార్యాభర్తల  మధ్య  అభిప్రాయభేదాలు  ఉండటం  అత్యంత  సహజం.

అందుకే  మన  పెద్దవాళ్ళు  సర్దుకుపోతూ  సంసారాలు  చేసారు. తమ  సుఖసంతోషాలను   కొద్దిగా  తగ్గించుకుని  అయినా పిల్లలను  సంతోషంగా  ఉంచారు.

...................

ఎన్నో  కష్టాలను  సహించి   కుటుంబవ్యవస్థను  నిలబెట్టిన  ఈ  దేశపు  పెద్దవాళ్ళకు  శిరస్సు  వంచి  నమస్కరిస్తున్నాను. 


  ..........................

దయచేసి  ఈ  క్రింది  లింక్ కూడా  చదవగలరు ..
  


Wednesday, December 10, 2014

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల..


  • పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు . 

    పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

    దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

    ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


    ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

    అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు. 


    వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


    వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

    వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


      శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


    శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


     ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


     మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు...మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

  • ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

    రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.

    ..........................................



    అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
     అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

     కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు.  


    .........................................

     వేదములలోని  కొన్ని  విషయాలు .....ఈ విషయాలు    అంతర్జాలంలో  సేకరించినవి.


     Before we begin our journey of solving the caste-puzzle through Vedas, let us start with certain worship mantras from Vedas that mention Shudras:


    Yajurved 18.48:
    O Lord! Provide enlightenment/ compassion to our Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. Provide me also with the same enlightenment so that I can see the truth.

    Yajurved 20.17:
    Whatever crime we have committed against my village, forest or committee; whatever crime we have committed through our organs, whatever crime we have committed against Shudras and Vaishyas, whatever crime we have done in matters of Dharma, kindly forgive us relieve us from the tendency of the same.

    Yajurved 26.2:
    The way I gave this knowledge of Vedas for benefit of all humans, similarly you all also propagate the same for benefit of Brahmins, Kshatriyas, Shudras, Vaishyas, Women and even most downtrodden. The scholars and the wealthy people should ensure that they not deviate from this message of mine
    .***
     There are several shlokas in Manusmriti that state that a person belonging to high Varna falls down to level of a Shudra (uneducated) if he does not conduct noble deeds. For example,

    2.104: A person who does not worship the Supreme Lord twice daily should be considered a Shudra.

    2.172. He who has not been initiated with teaching of the Vedas is a Sudra.

    4.245: A Brahmin acquires brilliance through company of noble persons and avoiding bad company. On contrary, if he indulges in bad company, he becomes a Shudra.


    ..................................

    గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

    బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.

    ..........................


    భీష్ముల  వారి  విషయంలో............

    భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


      అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

     దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  


    శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు. 

    పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.

    ....................................................


    కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


     భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  

  • నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.    
    జనకమహారాజులా.  

     నిష్కామ  కర్మతో  జీవించేవారు  
    ఆడంబరాలు లేకున్నా,   క్రుంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు . శబరి లా.

    భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ.



Friday, December 5, 2014

ఓం..


ఈ రోజు తిరువణ్ణామలైలో మహాదీపోత్సవం  జరిగిన  రోజు.  ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది.

తిరువణ్ణామలైలో  కొలువున్న దైవానికి నమస్కారములు.

దత్తజయంతి సందర్భంగా శ్రీ అనఘాదేవీ శ్రీ దత్తాత్రేయస్వామి వార్లకు నమస్కారములు.

శ్రీపాదశ్రీవల్లభస్వామి వారికి నమస్కారములు.

    దిగంబర! దిగంబర!! శ్రీపాదవల్లభ దిగంబర !!!
       శ్రీపాదరాజం శరణం ప్రపద్యే .

 శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ చరితామృతము  గ్రంధములో .. శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి గురించిన ఎన్నో వివరములు మరియు అత్యంత శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము ఉన్నవి. 

కొన్ని వివరములను.....ఈ  లింకుల  ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
         
    

Sripada Siddhamanagala Stotram.wmv - YouTube 

Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube