koodali

Saturday, May 31, 2014

బాధాకరమైన సంఘటన ...తద్వారా మంచి జరగటము ...

మేము  ఊరు  వెళ్ళి  నిన్ననే  తిరిగివచ్చాము. 

 కొంతకాలం  క్రిందట   మా  పేరెంట్స్  వాళ్ళు  ఒక   ఫంక్షన్  ఏర్పాటుచేశారు.  అందుకొరకు  మేము  ఊరు  వెళ్ళాము. 


  అయితే,   అక్కడ   ప్రమాదవశాత్తూ   మా  అమ్మగారు  క్రింద  పడటం  జరిగింది. భుజం  వద్ద  ఎముక   జారిందని  వైద్యులు  అన్నారు. 

 జారిన  భుజాన్ని   సెట్  చేయటానికి  ప్రయత్నించారు  కానీ ,  సరిగ్గా  సెట్  కాలేదని
అన్నారు

 ఇంతలో  మొదటి  డాక్టర్ ఫారిన్  ట్రిప్  వెళ్తూ   తనకు    ఫ్రొఫెసర్  అయిన  ఇంకొక  పెద్ద  డాక్టర్  వద్దకు  వెళ్ళమని  సిఫారస్  చేసారు.


చేతికి  కట్టుతో  కొత్త  డాక్టర్  వద్దకు  వెళ్ళగా,  భుజానికి    సర్జరీ  అవసరం  అన్నారు. అయితే  సర్జరీ  చేసేముందు  గుండె,  రక్తం, కిడ్నీ  ఎలా  ఉన్నాయో..  టెస్ట్  చేస్తారట. 


 ఆ  టెస్టులలో  మా  అమ్మగారికి   కిడ్నీలు  కొంతవరకూ  పాడయ్యాయని  తెలిసింది.  

  క్రియాటినైన్  లెవెల్  తగ్గితే  కానీ  సర్జరీ  చేయకూడదని  కొన్ని  రోజులు  హాస్పిటల్లోనే  ఉంచేసి  డయాలసిస్  చేసారు.  



ఇక  సర్జరీ  రోజు  ఆపరేషన్  ధియేటర్లోకి  తీసుకెళ్ళిన  తరువాత  మత్తుమందు  ఇచ్చేముందు  ఆ డాక్టర్  గారు  పేషెంట్  బలహీనంగా  ఉంది . సర్జరీ  చేస్తే  వేరే  ప్రాబ్లంస్  వచ్చే  అవకాశం  ఉందన్నారట.



 అప్పటికప్పుడు  సర్జరీ  మానుకుని  జారిన  భుజాన్ని  మళ్ళీ  సెట్  చేయటానికి  ప్రయత్నించగా  భగవంతుని  దయ  వల్ల     భుజం చక్కగా  సెట్  అయ్యింది. 


 సర్జరీ  అవసరం  లేకుండా
చక్కగా  సెట్  అవ్వటం .. అంతా  దైవం  దయ.  
...................

 మాకు  ఏమనిపించిందంటే,  చేయికి  జరిగిన  ప్రమాదం  వల్ల  ఒక  విధంగా  మంచే  జరిగిందనుకున్నాము. లేకపోతే   కిడ్నీ  వ్యాధి  ఉన్నట్లు  తెలిసేది  కాదు.  వ్యాధి  బాగా  ముదిరిన  తరువాత  బయటపడేది.

......................

 కిడ్నీ వ్యాధి  ఉందని   ప్రాధమిక  దశలో  గుర్తించి  తెలుసుకోవటానికి  ఈ  వ్యాధి  యొక్క   లక్షణాలు  త్వరగా  బయటకు  తెలియవట.
 



ఇవన్నీ  జరగటానికి  కొంతకాలం  క్రిందట  కాళ్ళకు  వాపు   వాచి  డాక్టర్  వద్దకు  వెళితే  ఎలర్జీ  అని  మందులు  ఇచ్చారట. 

 కిడ్నీ  వ్యాధి  ఉన్నట్లు   అప్పుడే  డాక్టర్లు   గుర్తించి  ఉంటే    వ్యాధి  ఉన్నట్లు  తెలిసేది. 

..................

మా  అమ్మగారి  వయస్సు  68 సంవత్సరాలు.  మా  నాన్నగారికి  70  పైన  ఉంటాయి.

 కిడ్నీ  జబ్బు  రావటానికి  అనేక  కారణాలుంటాయట.  బీపీ,  సుగర్  వ్యాధులు  ఉన్నవారికి  కిడ్నీ  జబ్బు  వచ్చే  అవకాశం  ఉందట. 

మా  అమ్మగారికి  5  సంవత్సరాల  క్రిందట  బీపీ   ఉందని  తెలిసింది.  అప్పటి  నుంచి  మందులు  వాడుతున్నారు.


 బీపీ  ఎక్కువగా  పెరిగితే  కిడ్నీలు  పాడయ్యే  అవకాశం  ఉందట.

 కాళ్ళు  వాయటం,    వాచిన  కాళ్ళను  నొక్కితే  చొట్ట  పడటం  వంటి  కొన్ని  లక్షణాలు  తప్పితే   కిడ్నీ   వ్యాధిని    గుర్తించటం  కష్టమంటున్నారు.   

...........................

అయితే,  బాధాకరమైన సంఘటన... తద్వారా మంచి  ఏమిటంటే  మా అమ్మగారికి జరిగిన  ప్రమాదం...తద్వారా  జరిగిన  టెస్టుల  వల్ల  కిడ్నీ  వ్యాధి  బాగా ముదరక  ముందే బయటపడింది.


ఇప్పుడు  క్రియాటినిన్ లెవెల్    చక్కగా   తగ్గిందని  వైద్యులు  అన్నారు.  అంటే ,  ఇప్పుడు  3  కి  తగ్గిందని  అన్నారు.  

ఇప్పుడిక    ప్రమాదం  లేదని,  ప్రస్తుతానికి   డయాలసిస్  అవసరం  లేదని  అన్నారు.  ఆహార  నియమాలు  పాటిస్తూ  మందులు  వాడుతుంటే  సరిపోతుందని  అన్నారు.  అంతా  దైవం  దయ.