koodali

Monday, March 10, 2014

హాస్టల్లో ర్యాగింగ్ ..


  ఈ  మధ్య  కాలంలో    రెండవ   తరగతి  నుంచే  పిల్లలను  హాస్టల్లో  వేస్తున్నారు  కొందరు  తల్లితండ్రులు.  అలా  వేయటానికి  వాళ్ళు  ఎన్నో  కారణాలను  చెబుతారు.  



  హాస్టల్స్ లో  ఉండే  పిల్లలకు  ఎన్నో  ఇబ్బందులు  ఉంటాయి.
సరే,  చిన్నపిల్లల  సంగతి  కాసేపు  అలా ఉంచితే  టీనేజ్  పిల్లలు  సంగతి  చూద్దాం.  



హాస్టల్లో   ర్యాగింగ్  ఎక్కువగా  ఉంటుందని  అంటారు...... మాకు    తెలిసిన  ఒకమ్మాయి  కొంతకాలం  క్రిందట  ఉన్నత  విద్యాభ్యాసం  కోసం  హాస్టల్లో  చేరింది.  ఆ  అమ్మాయి  అప్పటి  వరకు  చిన్న  టౌన్ లో  తల్లితండ్రుల  వద్దే  పెరిగింది. 



 హాస్టల్  అంటే  భయపడుతూ  చేరింది.   తల్లితండ్రి  ఉన్న  ఊరిలో  కాకుండా  ఆ  అమ్మాయికి  సిటీలోని  కాలేజీలో  సీట్  వచ్చింది.   తల్లితండ్రికి  ఉద్యోగం  కారణంగా  అమ్మాయితో  పాటు  వెళ్ళలేని  పరిస్థితి. 




హాస్టల్లో  చేరిన  కొత్తలో  సీనియర్లు  ర్యాగింగ్   చేసారట.  బహిరంగంగా  ర్యాగింగ్  చేస్తే  శిక్షపడుతుంది  కాబట్టి   రాత్రి  సమయంలో  జూనియర్లను   ర్యాగింగ్  చేసేవారట.



రోజూ  రాత్రి  11  గంటల  నుంచి   అర్ధరాత్రి  1  గంట  సమయం ..     కొత్తగా  చేరిన  అమ్మాయిలను  సీనియర్  అమ్మాయిలు  తమ  రూముకు  పిలిపించుకుని  డాన్స్  చేయమని,  పాటలు  పాడమని  అడిగేవారట.....కొత్తగా  చేరిన  వాళ్ళకు   ఇదంతా   చాలా  భయంగా  అనిపించేదట. 

 .......................................... 


  ప్రపంచం  ఎటు  పోతోంది  ?

వ్యక్తులు  ఇలా  తయారవటానికి  కారణాలు   ఏమిటి ?

 ఈ  వేధింపులను    తట్టుకోలేక ,  సున్నితమైన  మనస్తత్వం  గల   కొందరు  పిల్లలు  ఆత్మహత్యలు   చేసుకున్న  వార్తలను  మీడియా   ద్వారా  తెలుసుకున్నాము.  



ఇలా  ర్యాగింగ్   బారిన   పడిన  మరి  కొందరు  పిల్లలు  సున్నిత మనస్తత్వాన్ని  కోల్పోయి  మొండిగా  తయారవుతారు. 



   ర్యాగింగ్  వల్ల  బాధలు  పడిన  పిల్లలు  తాము  అనుభవించిన  బాధను  మర్చిపోయి .... మరుసటి  సంవత్సరం   కొత్తగా  కాలేజీలో  చేరిన  పిల్లలను   ర్యాగింగ్  చేయటానికి  తయారయిపోతారు.



 ఇలాంటి  బాధలకు  ఆడపిల్లలు,  మగపిల్లలు  అనే  తేడా  లేదు.
.................................

కొంతకాలం  క్రిందట  కొన్ని  వార్తలు  వచ్చాయి.    కొన్ని..హాస్టల్స్ లో   సీనియర్స్   కొందరు   జూనియర్స్ ను   లైంగికంగా  వేధించగా  ....భరించలేని  జూనియర్లు  కొందరు  సీనియర్స్  పై  ఫిర్యాదు  చేసారట.  



అయితే  ఎంతమంది  ధైర్యం  చేసి  ఇలా  ఫిర్యాదు  చేయగలరు  ?  ఫిర్యాదు  చేస్తే  పైవాళ్ళు  మరింత  వేధిస్తారేమో ? అని   భయపడి  కొందరు  పిల్లలు   తమలోతామే  బాధను  దిగమ్రింగుకుంటారు.  



ఇలాంటి  విషయాలను  తల్లితండ్రులతో  కూడా  చెప్పుకోవటానికి  భయపడతారు  కొందరు  పిల్లలు. 



  హాస్టల్  బాగోలేదు   అని....   పిల్లలు  చెప్పినా  అర్ధం  చేసుకునే  తల్లితండ్రులు  ఎంతమంది  ఉన్నారు  ?  




 ఏది  ఏమైనా  ఈ  కాలపు  కొందరు  తల్లితండ్రుల  ధోరణి,    పిల్లల  పరిస్థితి ,  విద్యావిధానం...అయోమయంగా  తయారయ్యాయేమో ?  అనిపిస్తుంది.







No comments:

Post a Comment