koodali

Monday, January 13, 2014

దైవం నిత్యం.. దైవానికి ఆది, అంతము లేవు ..ఉదాహరణ.. మరియు..


సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  దైవం  వల్ల   ప్రారంభమయ్యింది.  . అని  ఆస్తికులు   ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.


    సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  నాస్తికులు  సరైన , హేతుబద్ధమైన  జవాబు  చెప్పలేరు. 



కొంతకాలం  క్రిందట   టీవీ చానల్ లో  ఆండాళ్  అమ్మవారి  చరిత్ర  ( శ్రీ గోదాదేవి  శ్రీ రంగనాధుల కల్యాణం ) 
సినిమాగా  ప్రసారమయ్యింది. అందులోని కొన్ని  విషయాలు..

 ఆ  కధలో,    ఒక  రాజుగారు  నాస్తికులు.

ఆ  రాజు  ,  ఆస్తికులను ,  దైవం  గురించి   కొన్ని    ప్రశ్నలు  అడుగుతారు.   


సృష్టికర్త  అయిన  దైవాని  కంటే  ముందు  ఏమున్నది ?  అనే  అర్ధం  వచ్చేటట్లు ...  ప్రశ్న  అడుగుతారు.


 అప్పుడు ,  ఆండాళ్  మాతకు  తండ్రి  అయిన  విష్ణుచిత్తుల  వారు   రాజుతో ...  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఉన్న  అంకె  పేరు  చెప్పమంటారు.


 అప్పుడు  రాజు  చెప్పలేకపోతారు.  (  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ  అంకె  లేదు  కదా  !  )

 
విష్ణుచిత్తుల  వారు  చెప్పిన విషయములో ఎన్నో విషయములు ఉండి ఉంటాయి. అవన్నీ నాలాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....నాకు  తోచినంతలో  కొన్ని  అభిప్రాయాలు... 

         
ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ   అంకె   లేదు.  అలాగే,  

 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం  నిత్యం.  దైవానికి  ఆది అంతమూ  లేదు. అని  చెప్పటం   విష్ణుచిత్తుల వారి  అభిప్రాయం  కావచ్చు .   అనిపిస్తోంది . 

 ...............................

 సంఖ్యలలో  ఆఖరి  సంఖ్య  ఏది  ?   అనే  ప్రశ్నకు  కూడా  మనకు   జవాబు  తెలియదు. 


ఎందుకంటే,  సంఖ్యలను  అలా  లెక్కవేసుకుంటూ   వెళ్తే    ఒకదాని  తరువాత  ఒకటి  అంతం  లేకుండా  అలా  వస్తూనే  ఉంటాయి  కదా  !


.............................


   ఆది,  అంతమూ  లేక   అంతటా  వ్యాపించి  ఉన్న  శక్తినే  దైవమని  ఆరాధిస్తారు.  ఆస్తికులు.


అసలు  ప్రతిదానికి    ఆది ,  అంతమూ  ఉంటుందని   ,  ఉండాలని  మనం  ఎందుకు  అభిప్రాయపడాలి  ?

సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే,  మనకు   తెలియని  విజ్ఞానం   సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా. 


  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

...............................

 రామకృష్ణపరమహంస  శారదాదేవిల   శిష్యులైన   వివేకానందుని  జయంతి ,

సంక్రాంతి  పండుగ  రోజుల లో  సూర్యారాధన  ,

 గోదారంగనాధుల   కల్యాణం  ( భోగి పండుగ),


 సంక్రాంతి, 
మీలాదున్నబి ,  అయ్యప్ప  స్వామి  మకరజ్యోతి  దర్శనం.... 

అన్నింటి   సందర్భంగా    అందరికి  శుభాకాంక్షలు.




7 comments:


  1. ఒకటి కి ముందు సున్నా ఉందండీ . సున్న భగవంతుడి ఐడెంటిటీ !

    భగవంతునికి ముందు (సున్న కి ముందు) నెగటివ్ డిజిట్స్ ఉన్నా యండి . అవి పాసిటివ్ కి ఆపొసిట్ అన్న మాట . అంటే భగవంతునికి ముందు ఈ ప్రపంచపు మిర్రర్ ఇమేజ్ ఉండే దేమో మరి . సో ఆ మిర్రర్ ఇమేజ్ భగవంతుని మూలం గా మనం ఉన్న ఈ సృష్టి అయింది అనుకుంటే మరి శూన్యం లో ఈ రెండూ (మిర్రర్ ఇమేజ్ ప్లస్ మన విశ్వమూ కలిసి ) సమ్మిళిత మయి ఉండి ఉండాలి మరి . శూన్యం నించి విడి వడితే ఒక వైపు కి మరో వైపు మిర్రర్ ఇమేజ్ అవుతుందేమో మరి .

    సో మన విశ్వానికి మరో విశ్వం ఆపోజిట్ కేరెక్టర్స్ తో ఖచ్చితం గా ఉండాలేమో మరి ?


    క్రాంతి సంక్రాంతి !

    శుభాకాంక్షల తో
    జిలేబి
    జిలేబి

    ReplyDelete

  2. జిలేబి గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీకు మీ కుటుంబసభ్యులకు క్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు.

    సున్న యొక్క గొప్ప శక్తి ఏమిటి ? వంటి అద్భుతమైన రహస్యాలు దైవానికే తెలియాలి.

    ఒకటి అనే అంకెకు ముందు ఏ అంకె లేదు.

    ఒకవేళ మీ అభిప్రాయం ప్రకారం, నెగటివ్ డిజిట్స్ ను అంకెలు, సంఖ్యలుగా భావించి చూసినా ...

    నెగటివ్ డిజిట్స్ లెక్కపెడుతూ వెళ్తే ...అలా వస్తూనే ఉంటాయి.......

    దైవానికి ఆది, అంతము లేదు.

    అంతా దైవం దయ.


    ReplyDelete
  3. విష్ణుచిత్తులవారు చెప్పిన విషయములో ఎన్నో విషయములు ఉండిఉంటాయి. అవన్నీ నాలాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా మరికొంత ఏమనిపిస్తుందంటే....

    దైవం ఈ ప్రపంచాన్ని సృష్టించారు అని ఆస్తికులు అంటే, మరి దైవాన్ని ఎవరు సృష్టించారు ? అని ప్రశ్నిస్తారు. నాస్తికులు.

    విష్ణుచిత్తులవారు చెప్పిన విషయాన్ని గమనిస్తే,

    ఒకటి అనే అంకెకు ముందు ఏ అంకె లేదు. అలాగే,

    దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు. దైవం నిత్యం. దైవానికి ఆది అంతమూ లేదు. అని చెప్పటం విష్ణుచిత్తుల వారి అభిప్రాయం కావచ్చు . అనిపిస్తోంది .

    ReplyDelete
  4. A negative number is less than zero. Such numbers are often used to represent the amount of a loss or absence.

    ప్రఖ్యాత ఐన్ స్టీన్ చిన్నతనములో జరిగిన విషయముగా చెప్పబడుతున్న చర్చలోని కొన్ని విషయములు ఇక్కడ ఇస్తున్నానండి.

    Student : Sir, you can have lots of heat, even more heat, superheat, mega heat, white heat, a little heat or no heat. But we don’t have anything called cold. We can hit 458 degrees below zero which is no heat, but we can’t go any further after that. There is no such thing as cold. Cold is only a word we use to describe the absence of heat. We cannot measure cold. Heat is energy. Cold is not the opposite of heat, sir, just the absence of it.

    (There was pin-drop silence in the lecture theater.)


    Student : What about darkness, Professor? Is there such a thing as darkness?

    Professor: Yes. What is night if there isn’t darkness?

    Student : You’re wrong again, sir. Darkness is the absence of something. You can have low light, normal light, bright light, flashing light. But if you have no light constantly, you have nothing and its called darkness, isn’t it? In reality, darkness isn’t. If it is, well you would be able to make darkness darker, wouldn’t you?

    పై విషయాన్ని గమనిస్తే ఏమనిపిస్తుందంటే, పోసిటివ్ డిజిట్స్ వల్లే నెగటివ్ డిజిట్స్ ప్రస్తావన వస్తోంది. అందువల్ల అంకెలు, సంఖ్యలు అంటే పోసిటివ్ డిజిట్సే . నెగటివ్ డిజిట్స్ ను అంకెలుగా, సంఖ్యలుగా భావించలేము.

    ReplyDelete

  5. నేనొక చోట చదివాను.ఈ విశ్వంలో మనప్రపంచంలాటి ప్రపంచమే ఒకటి ఉంటుందట.అందులో మనలాటి వాళ్ళే(mirror images)ఉంటారట.ఇది కల్పన కాదు scientific fact అట.తమాషాగాఉందికదూ.

    ReplyDelete

  6. నేనొక చోట చదివాను.ఈ విశ్వంలో మనప్రపంచంలాటి ప్రపంచమే ఒకటి ఉంటుందట.అందులో మనలాటి వాళ్ళే(mirror images)ఉంటారట.ఇది కల్పన కాదు scientific fact అట.తమాషాగాఉందికదూ.

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీరన్నట్లు , ఇలాంటి ప్రపంచమే మరొకటి ఉంటే నిజంగా చాలా తమాషాగా ఉంటుందండి. విశ్వంలో మరెన్నో వింతలు విశేషాలు ఉండి ఉంటాయనిపిస్తుంది.
    .................

    ఒక యోగి ఆత్మ కధ పుస్తకంలో ఎన్నో లోకాల గురించిన వివరాలున్నాయండి. ఆ లోకాలలో వింతలు విశేషాలు చాలా ఉంటాయి.

    శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తాము పరమపదించిన కొన్ని రోజుల తరువాత పునరుత్ధానం చెంది ఆయా లోకాల గురించి తమ శిష్యునికి చెప్పటం జరిగింది.

    అందులో కొన్ని విషయములు........
    "సూక్ష్మ శరీరులతో నిండిన సూక్ష్మ గ్రహాలు చాలా ఉన్నాయి."

    అక్కడి వాళ్ళెవరూ స్త్రీ గర్భాన జన్మించిన వారు కారు: సూక్ష్మలోకవాసులు తమ విశ్వ సంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక ( అవయవ ) నిర్మాణమూ ,సూక్ష్మ శరీరమూ గల సంతానాన్ని సృష్టించుకుంటారు.

    సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా , మానసికప్రసార ( టెలిపతీ ) సూక్ష్మదూరదర్శనాల ( ఆస్ట్రల్ టెలివిజన్ ) ద్వారా జరుగుతుంది.

    మానవుడు ప్రధానంగా ఘన,ద్రవ,వాయు పదార్ధాల మీదా గాలిలో ఉన్న ప్రాణ శక్తి మీదా ఆధారపడి ఉన్నవాడు : కానీ సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు.

    సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయటం , అదృశ్యం చేయటం చేస్తూంటారు.
    సూక్ష్మ ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైనదీ పరిశుభ్రమైనదీ పరిశుద్ధమైనదీ సువ్యవస్థితమైనదీ.

    ఇలా ఎన్నో విషయాలు శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యునికి చెప్పటం జరిగింది.

    ReplyDelete