koodali

Wednesday, February 27, 2013

నియమాలు మన మంచికే .


 జీవితంలో నియమనిబంధనల  వల్ల   స్వేచ్చ  తగ్గిపోతుంది  కదా ! అని  కొందరు  భావిస్తారు.  స్వేచ్చ  తగ్గినట్లు  కనిపించినా  నైతికవిలువలను  పాటించకపోతే  సమాజమే  ప్రమాదంలో  పడిపోతుంది. మనిషి  మనుగడకే  ముప్పు  వస్తుంది. ఇవన్నీ  ఆలోచించిన  పెద్దలు  సమాజం  సజావుగా  సాగటం  కోసం   కొన్ని  విలువైన  నియమనిబంధనలను  ఏర్పరిచారు.


 మనకు  నచ్చిన  వంటకాన్ని  మరీ  ఎక్కువెక్కువగా  తినేస్తే    హరాయించుకోలేక  విరేచనాలు  పట్టుకుంటాయి. దీన్ని  బట్టి  ఏం  అర్ధమవుతోందంటే , మనకు  ఇష్టమైన  వంటకాన్నైనా  హద్దులేకుండా  తినే  స్వేచ్చ  మనకు  లేదు
  అని అర్ధమవుతుంది.  


 అలాగే  జీవితంలో  కొన్ని  హద్దులు,  నియమనిబంధనలు  ఉంటాయి.  వాటి  ప్రకారం  జీవిస్తే  అందరూ  సుఖంగా  ఉండవచ్చు  హద్దులు  దాటితే  కష్టాలే  .


 మనిషి  మనస్సు  చంచలమైనది . మనస్సును  అదుపులో  పెట్టటం  అత్యంత  కష్టమైన  విషయం.  కష్టాలు  వస్తాయని  తెలిసినా .. మనస్సును  అదుపులో  ఉంచుకోలేక   కొందరు
నియమనిబంధనలను  అతిక్రమిస్తుంటారు . 


 తమకు  తాముగా  నైతిక విలువలను  పాటించే  దృఢమైన  మనస్సు  అందరికీ  ఉండదు.  పరిసరాల  ప్రభావం  వల్ల  కూడా  కొన్నిసార్లు  మానసిక  దృఢత్వం   చెదిరిపోయే  అవకాశం  ఉంది. 

ఇవన్నీ  ఆలోచించిన  పెద్దలు  సమాజం  సజావుగా  సాగటం  కోసం   కొన్ని  నియమనిబంధనలను  ఏర్పరిచారు. వాటిలో  కొన్నింటిని చూద్దాము.   

*ఉదా...అత్యాశ  ఉండటం ,ఇతరుల  సంపద  తనకు  కావాలని  ఆశపడటం  తప్పు .  అని  పెద్దలు  తెలియజేశారు.   

 *ఉదా... మద్యపానం  చేయటం  తప్పు.  అని కూడా  పెద్దలు  తెలియజేశారు.

* ఉదా..  అత్యాశ  కలిగిన  వాళ్ళు  ప్రపంచంలోని  సంపదంతా  తనకే  కావాలని  కోరుకుంటారు.  ఆ  ఆశతో   అందరి  పొట్టలనుగొట్టి  తామే  సంపదనంతా  పోగేసుకుంటారు.  ఇలాంటి  అత్యాశపరుల  వల్ల  సమాజంలో  పేదరికం  పెరిగి, పేదవాళ్ళు   బాధలను  అనుభవిస్తుంటారు.


*ఉదా ... మద్యపానానికి  బానిసలైన  వ్యక్తులలో   కొన్నిసార్లు  విచక్షణ  లోపిస్తుంది.  ఆ  మత్తులో  వారు   నేరాలు  చేసే  అవకాశం  కూడా ఉంది.  


మద్యపాన వ్యసనానికి  బానిసైన  వ్యక్తుల  ఆరోగ్యం  పాడవుతుంది. ఇలాంటి  వారికి  కలిగే  సంతానానికి  కూడా   భవిష్యత్తులో  అనారోగ్య  సమస్యలు  వచ్చే  అవకాశాలు  మెండుగా  ఉన్నాయని  పరిశోధనల  వల్ల  తేలిన  విషయం.


  ఈ  మద్యపాన  వ్యసనానికి  బానిసలైన   కొందరు   తమకు  వచ్చే  ఆదాయాన్నంతా ఈ  అలవాటు  కోసం  ఖర్చుపెట్టేస్తుంటారు.  ఇలాంటి  వారి  కుటుంబసభ్యులు  ఎన్నో  కష్టాలు  పడుతుంటారు. 

ఇవన్నీ  ఆలోచించి , అందరు  మద్యపానానికి  దూరంగా ఉండాలి . అని  పెద్దలు తెలియజేశారు .

మద్యపాన  నిషేధాన్ని అమలు  చేస్తే ఎన్నో  కుటుంబాలు బాగుపడతాయి.  


ఇవన్నీ  గమనిస్తే  మనకు  ఏం  తెలుస్తుందంటే,  నైతిక  విలువలంటే .. మన  మంచిని  కోరి   సమాజం  సజావుగా  సాగటానికి  పెద్దలు  ఏర్పరిచిన  నియమనిబంధనలు. 


 ఈ  నియమాలను పాటిస్తే  మనకే  మంచిది.  పాటించకపోతే  కష్టాలను  అనుభవించవలసి  వస్తుంది.  
 .................... 

ఈ  బ్లాగును  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి .


 

Monday, February 25, 2013

నీటిలో తేలే రామసేతు రాళ్ళు మరియు కొన్ని వీడియోలు,..



Floating stones in Ram Setu - Scientific validation - YouTube

 

**********

ఒక  యోగి  ఆత్మ  కధ  గ్రంధములో  శ్రీశ్రీ  మహావతార్  బాబాజీ  మరియు ఎందరో  మహానుభావుల  గురించిన  విషయములున్నవి.

 ఈ  మహానుభావులు  మరియు  శ్రీ శ్రీ  రామకృష్ణ  పరమహంస  మొదలైన  మహానుభావుల  గురించిన  విషయములు  ఈ  క్రింది  వీడియోలలో  ఉన్నవి.

*************

Om guru om - YouTube

 

*********

Holy Trinity Prayers - Sri Ramakrishna Paramahamsa ... - YouTube

**********

Swami Vivekananda 1893 Chicago Speech Part I - YouTube


**************

Mahavatar Babaji Mantra (108 Repetitions) - YouTube



************

"God helps God" Paramhansa Yogananda - YouTube



 *******

Swami Yogananda - High Quality Video - Pershing Square New York


****

Ramana Maharshi, Swami Yogananda & Paul Brunton - YouTube

**

 

Friday, February 22, 2013

దైవమే దిక్కు. ..


నిన్న  హైదరాబాద్ లో  జరిగిన  బాంబుపేలుళ్ళలో   కొందరు  చనిపోవటం ,  మరి కొందరు  గాయాల  పాలవటం అత్యంత  విషాదకరమైన సంఘటనలు.  

 పేలుళ్ళు  జరిగే  అవకాశముందని   చూచాయగా   తెలిసినా , సరిగ్గా  ఎక్కడ  జరిగే  అవకాశం  ఉందో  ముందే  కనిపెట్టటం  అనేది    కష్టమైన  విషయం.  

ముందు  సాయిబాబా  గుడి  వద్ద  పేలుళ్ళు  జరపాలని నిందితులు  పధకం  వేసుకున్నారని  వార్తల  ద్వారా  తెలుస్తోంది.  గురువారం  గుడివద్ద   భక్తుల  రద్దీ  ఎక్కువగా  ఉంటుంది  కాబట్టి  ఎక్కువ  జననష్టం  కలిగించాలని  నిందితుల  ఉద్దేశ్యంగా  వార్తలు  వస్తున్నాయి. అయితే,  సాయిబాబా  గుడిలో  పోలీస్  కమిషనర్  గారు  పూజలు  చేయించటం,  అక్కడ   పోలీసు  పహరా   ఎక్కువగా  ఉండటం  వల్ల  నిందితులు  పేలుళ్ళ  స్థలాన్ని  మార్చారని  అంటున్నారు. 


 ఇలాంటి  సంఘటనలు  జరిగినప్పుడు  కొన్ని  విషయాలు  ఆశ్చర్యాన్ని  కలిగిస్తాయి.  కొందరు  అనుకోకుండా   ఏదో  ఒక  పనివల్ల  సంఘటనా స్థలానికి  వచ్చి  ప్రాణాలు  కోల్పోవటం  జరుగుతోంది. కొందరు  మృత్యుంజయులు  సంఘటనా  స్థలానికి  దగ్గరలోనే  ఉన్నా  కూడా  కొద్దిపాటి  గాయాలతో  ప్రమాదం  నుంచి  బయటపడటం   కనిపిస్తోంది. 

  ఏది  ఎప్పుడు  ఎందుకు  ఎలా జరుగుతుందో ? ఏమిటో  ? అన్నీ  భగవంతునికే  తెలియాలి.
 
 ఈ  సంఘటనలో   కొందరు  చనిపోవటం  అత్యంత  దురదృష్టకరం. వారి  ఆత్మలకు  శాంతి  లభించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

............

దైవభక్తి   నైతికవిలువలను  పాటించటం, దేశభక్తి,  ఎవరి  బాధ్యతను  వారు  చక్కగా  నిర్వర్తించటం   ద్వారా   సమాజంలో  నేరాలు..ఘోరాల  నుండి  విముక్తి  లభిస్తుంది.

 

Wednesday, February 20, 2013

నైతిక విలువల పట్ల గౌరవం తగ్గిపోవటం ........

ఇప్పటి   సమాజంలో  మంచి పనులు  చేస్తున్న వాళ్ళూ  ఉన్నారు.  చెడ్డపనులు  చేస్తున్న  వాళ్ళూ  ఉన్నారు.. కొన్ని  మంచి  పనులూ,  కొన్ని  చెడ్డ పనులూ  చేస్తున్న  వాళ్ళూ  ఉన్నారు.   

 దేశంలో  అవినీతి  ,  మహిళలపై  అఘాయిత్యాలు,  అశ్లీలత  వంటివి  పెరిగిపోతున్నాయని  గోలపెడుతున్నాం.  ఇవన్నీ  పెరగటానికి  కారణాలేమిటి  ? 
వ్యక్తులు  నేరస్తులుగా  తయారవ్వటంలో  సమాజం  బాధ్యత  ఉండకుండా  ఉంటుందా  ?

సమాజంలో  నేరాలు  పెరగటానికి  మనుషుల్లో   నైతిక  విలువల  పట్ల  గౌరవం  తగ్గిపోవటం   అనేది  ఒక  ముఖ్యమైన  కారణం. 


పసిపిల్లలుగా  ఉన్నప్పుడు  పిల్లలు  అందరూ  కల్మషం  లేని  చిరునవ్వులతో  అమాయకంగా  ఉంటారు.  మరి  పెద్దయిన  తరువాత  వీళ్ళల్లో  కొందరు   చెడ్డపనులను  ఎందుకు  చేస్తున్నారు ?



వ్యక్తుల  ప్రవర్తనపై  తల్లితండ్రులు, స్నేహితులు  మరియు  సమాజం  యొక్క  ప్రభావం  ఎంతో  ఉంటుంది.   నేరాలు  పెరగటానికి  సమాజంలో  పెరిగిపోతున్న  ఆర్ధిక  అసమానతలు,  పేదరికం,   అందుకోలేని  ఆకర్షణలు  వంటి   కారణాలెన్నో  ఉన్నాయి.  నిరాశానిస్పృహలకు  లోనవుతున్న  వ్యక్తులు  నేరాలకు  పాల్పడుతున్నారు.



 సమాజంలో  జరుగుతున్న  నేరాలను  తగ్గించాలంటే    అందుకు  గల  కారణాలను  అన్వేషించి,   ఇక  ముందు  అలాంటి  చెడ్డపనులు  జరగకుండా , వ్యక్తులలో  చెడ్డతనం  పెరగకుండా  తగిన  చర్యలను  చేపట్టాలి.  అంతేకానీ  నీది  తప్పంటే  నీది  తప్పని  సమాజంలోని  అందరూ  ఒకరినొకరు  దుమ్మెత్తిపోసుకోవటం  వల్ల  సమస్యలు  పరిష్కారం  కావు. 



చిన్నతనం  నుంచి  పిల్లలకు  నైతికవిలువల  పట్ల  గౌరవాన్ని  కలిగిస్తే  వాళ్ళు  చక్కటి  పౌరులుగా  తయారవుతారు.  చక్కటి  పౌరులున్న సమాజంలో  నేరాలు  జరగటం  గణనీయంగా  తగ్గుతుంది.    


అయితే జీవితం  గురించి  ధర్మాధర్మాల  గురించి  పిల్లలకు  ఎలా  తెలుస్తుంది?  వారికి   ఎవరు  తెలియజేస్తారు  ?

తల్లితండ్రి  పిల్లల  పట్ల   శ్రద్ధగా  ఉంటూ  వారితో  మాట్లాడుతూ  ఉంటే  పిల్లలు  ఉత్సాహంగా  ఉంటారు. తల్లితండ్రులు  బిజీగా  ఉండి  పిల్లలను  పట్టించుకోకుంటే  పిల్లలు  అభద్రతా  భావంతో  మానసికంగా  క్రుంగిపోతారని,  మానసికనిపుణులు   చెబుతుంటారు.  ఇవన్నీ  తెలిసిన  కొందరు  తల్లితండ్రులు  తాము  పనివత్తిడితో  బిజీగా  ఉన్నా  కూడా  సమయాన్ని  కల్పించుకుని  పిల్లలకూ  ఎక్కువసమయాన్ని  కేటాయిస్తారు.


అయితే, ఈ  రోజుల్లో  ఎక్కువమంది  తల్లితండ్రులకు  తమ  పిల్లలతో  మాట్లాడటానికి  కూడా  తగినంత   సమయం  లేనంతగా  పనివేళలు  పెరిగిపోయాయి.

 ఉదయం  వెళ్తే  రాత్రికి  అలసటగా  ఇంటికి  చేరే  తల్లితండ్రులకు  పిల్లలతో  తీరుబడిగా  మాట్లాడటానికి  కూడా  ఓపిక  ఉండదు. 



  ఇక,   పాఠశాలలో  చూస్తే , ఉదయం  నుంచి  రాత్రి  వరకు  పిల్లలను  కూర్చోబెట్టి ,   కొండంత   సిలబస్ తో  బోలెడు  సబ్జెక్టులను  బోధిస్తుంటారు.  
 
ఇలా  అందరికీ  బిజీగా  రోజులు  గడిచిపోతూంటాయి. 
ఇక   జీవితం  గురించి  ధర్మాధర్మాల  గురించి  పిల్లలకు  ఎలా  తెలుస్తుంది  ?  తెలిసినా  అమలుజరిగేలా   ఎవరు  చూస్తారు  ?



 ఇలాంటప్పుడు   కొద్దిపాటి  తీరిక  సమయాల్లో   చూసే  ప్రసారమాధ్యమాల్లోని   కొన్ని కధలలోని   చిత్రవిచిత్రమైన  పాత్రలనే  ఆదర్శంగా  తీసుకుని   పిల్లలూ అలా తయారవుతారు.
 

 ఈనాటి  పిల్లలే  రేపటి  పెద్దలు  (  పౌరులు  ). వీళ్ళ  ప్రవర్తన   పైనే  సమాజం  యొక్క  మంచిచెడ్డలు  ఆధారపడి  వుంటాయి.   అందువల్ల  సమాజంలోని  పెద్దవాళ్ళందరూ   తమ  వంతు  బాధ్యతను  సరిగ్గా  నిర్వర్తించినప్పుడు   సమాజానికి  చక్కటి  పౌరులు  తయారవుతారు.

* శ్రీ  రామకృష్ణుల శిష్యులైన శ్రీ వివేకానందుల వారు చెప్పినట్లు సత్యం, పవిత్రత, నిస్వార్థత, ఇనుపకండలు,ఉక్కునరాలు కలిగిన  వ్యక్తులు ఇప్పుడు సమాజానికి ఎంతో అవసరం.


Monday, February 18, 2013

ఈ రోజుల్లో పరిస్థితి...


 ఈ  రోజుల్లో  స్త్రీల  పరిస్థితి  పెనం  మీద నుంచి  పొయ్యిలో  పడినట్లు (?) తయారయ్యింది. 


పాతకాలంలో  లాగా  ఇంట్లో  ఉంటే  తమకు గుర్తింపు  ఉండటం  లేదని  భావించిన  ఈనాటి   స్త్రీలు  బయటకు  వస్తున్నారు.

స్త్రీలు  బయటకు  రాకూడదని  అనలేము.  వైద్యులు, నర్సులు,   అధ్యాపకులు .... వంటి  రంగాలలో   మహిళలు పనిచేయటం  అవసరం  కదా !

  కారణాలు   ఏవైనా నా ఈనాటి  స్త్రీలకు  ఇంటా  బయటా  చాకిరీ  పెరిగిపోయిందేమో..    అనిపిస్తుంది.


ఈ  మధ్య   స్త్రీల  పట్ల  జరుగుతున్న  నేరాల  గురించిన  వార్తలు  వింటుంటే  సమాజం  ఇలా ఎందుకు   తయారయిందో  అర్ధం  కావటం  లేదు.

అందువల్ల  స్త్రీలు   ప్రయాణించటానికి ,  స్త్రీల  రక్షణ  కోసం   ప్రత్యేక  వాహన  సర్వీసులను  ఏర్పాటు  చేసే  ప్రయత్నాలు  జరుగుతున్నాయట.  



ఇవన్నీ  అలా  ఉంచితే,   ఈ  మధ్య  కాలంలో  మరికొన్ని  వార్తలను  గమనించితే ,  వివాహవ్యవస్థ   విచ్చిన్నమవటం ,  వివాహేతర సంబంధాలు,  విడాకులు,   యువతరంలో   సహజీవనం ...వంటివి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.


ఇంకా స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న అమ్మాయిల  పట్ల , ఆఫీసుల్లో   పనిచేసే   మహిళల పట్ల   కొందరు మగవారి వేధింపులు,   గురించి వింటున్నాము.


ఇవన్నీ వింటున్న భార్యలకేమో   తమ భర్తల   గురించిన బెంగ,   భర్తలకేమో   తమ భార్యల గురించిన బెంగ, తల్లిదండ్రులకేమో   తమ పిల్లల   గురించిన బెంగ ఉంటుంది.

ఇలా పరస్పర అనుమానాలు, భయాలతో ఎన్నో కుటుంబాల్లో   గొడవలు జరగటం , అవి విడాకులకు  దారితీయటం  జరుగుతోంది. 



 
ఈ   రోజుల్లో  స్త్రీలకు   అనేక  సమస్యలు. .....బయట   రక్షణ  సమస్య,  ఇంటాబయటా  చాకిరీతో  అలసిపోవటం  సమస్య ,  కుటుంబానికి   తగినంత  సమయాన్ని  కేటాయించలేకపోవటమనే  సమస్య, 


పై  విషయాలను  గమనించితే  ఏమనిపిస్తుందంటే,   కొంతకాలం   క్రిందట   ఆడవారి   కోసం   విడిగా పాఠశాలలు,  కళాశాలలు,  కార్యాలయాలు   ఉండేవి. మళ్ళీ   ఆ పద్దతి   వస్తే  ఈ   బాధలు సగమయినా తగ్గే  అవకాశముంది .  అనిపిస్తోంది. 


 మొహమాటం  లేకుండా  చెప్పాలంటే,   స్త్రీలకు  పురుషులకు  వేరువేరుగా  పాఠశాలలు,  కళాశాలలు,   ఉంటే  చాలా  సమస్యలు  తగ్గుతాయి. ( పురుషుల  వేధింపులు  స్త్రీలకు  ఉండవు  కదా  ! )



 ఇంకో  సమస్య  ఏమిటంటే,    పని  వేళలు  పెరిగిపోవటం  వల్ల   స్త్రీలు  ఆఫీసులకు  ఉదయం  వెళ్తే  రాత్రి  ఇంటికి  చేరటం  జరుగుతోంది.  దాని  వల్ల  పిల్లలకు   తగినంత  సమయాన్ని  కేటాయించలేకపోతున్నారు.


అలా కాకుండా మహిళలే  స్థాపించిన   పరిశ్రమల్లో అయితే   వారు తమకు  తగ్గట్లు  పనివేళలను  ఏర్పాటు  చేసుకునే  అవకాశముంటుంది.  ఉదా....ఉదయం   10 నుంచి సాయంత్రం 4 వరకు  మాత్రమే  పనిచేసి  త్వరగా  ఇంటికి  వెళ్ళిపోవచ్చు.



ఆ విధంగా కుటుంబానికీ  న్యాయం జరుగుతుంది. ఇంకా ఆఫీసు దగ్గర్లో   బేబీ  కేర్  సెంటర్  ఏర్పాటు చేసుకుంటే  చంటి పిల్లల   తల్లులు మధ్యలో  వెళ్ళి చూసుకోవచ్చు.


ఆ మధ్య నేను పత్రికలో చదివాను. ఒక పేరున్న బాంక్ వారు పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఒక శాఖను బెంగళూరులో ఏర్పాటు చేశారట. అలాగే ఒక పరిశ్రమ వారు స్పేర్ పార్టులు తయారు చేసే ఒక యూనిట్ ను మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేశారట.


ఇలాంటి  మార్పులు  చేర్పులు  జరిగితే  సమాజంలో  ఎన్నో  సమస్యలు  తగ్గుతాయి.


ఇక  ఇంట్లో  ఉండే   స్త్రీలు   తాము  ఖాళీగా  ఉన్నామని  బాధపడవలసిన  అవసరం  లేదు. 

 ఉదయం  10  నుంచి  సాయంత్రం  4  వరకు  పిల్లలు  స్కూల్  నుంచి  ఇంటికి  వచ్చేలోపు ఇరుగుపొరుగు  మహిళలు  కలిసి  పిండివంటలు, కుట్లు  అల్లికలు   వంటివి  నేర్చుకోవటం, సంగీతం  నేర్చుకోవటం,  ఆయుర్వేద  మందుల  తయారీ  వంటివి  నేర్చుకోవచ్చు.


 లేక  ధనవంతులై  చదువుకున్న కొందరు స్త్రీలు  కలిసి  మహిళా  మండలిలా  ఏర్పడి , పేద స్త్రీల  చేత  చిన్న  తరహా  కుటీరపరిశ్రమలను  ఏర్పాటుచేయించి ,  వారి  ఆదాయం  పెరిగేలా  ప్రోత్సహించవచ్చు. వారికి  విద్యను , ఆరోగ్య  సలహాలను  నేర్పించవచ్చు.


ఇవన్నీ చేయటం కుదరకపోయినా ........ సమాజానికి ఏదైనా సహాయం చెయ్యాలని   భావించే  ఆడవాళ్ళు   చుట్టుపక్కల   పేద పిల్లలకు ట్యూషన్ చెప్పవచ్చు. తమకు తెలిసిన కుట్లు, అల్లికలు, ఫాబ్రిక్ పెయింటింగ్   వంటివాటిని  వారికీ   నేర్పించవచ్చు.

 ఈ  రోజుల్లో  ఎందరో  స్త్రీలు  తమకు  వీలున్నంతలో  సమాజానికి  సహాయం  చేస్తున్నారు. ఇది  అభినందనీయ  విషయం.


 


Friday, February 15, 2013

ఓం. సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము... మహాశక్తి అయిన పరమాత్మ ..సూర్యుడు .....

ఓం
.............
సరస్వతీ  ద్వాదశనామ  స్తోత్రము.
 
సరస్వతీమయం  దృష్ట్వా వీణా  పుస్తకధారిణీమ్
హంస
వాహ సమాయుక్తా  విద్యా  దానకరీ మమ..1
ప్రధమం  భారతీ నామ  ద్వితీయం  చ  సరస్వతి 
తృతీయం  శారదాదేవి   చతుర్ధం  హంసవాహినీ ..2
పంచమం  జగతీ  ఖ్యాతా  షష్టం  వాగీశ్వరీ  తధా
 కౌమారీ  సప్తమం  ప్రోక్తా   అష్టమం బ్రహ్మచారిణీ..3
నవమం  బుద్ధిదాత్రీ చ  దశమం  వరదాయినీ
 ఏకాదశే  క్షుద్రఘంటా  ద్వాదశం  భువనేశ్వరీ..4
బ్రాహ్మీ  ద్వాదశ నామాని  త్రిసంధ్యం  యఃపఠేన్నరః
సర్వ సిద్ధికరీ   తస్య  ప్రసన్నా  పరమేశ్వరీ..5


సా మే వసతు  జిహ్వాగ్రే  బ్రహ్మరూపా  సరస్వతి 
ఇతి  శ్రీ  సరస్వతి  ద్వాదశనామ స్తోత్రం  సంపూర్ణము  .
ఫలం: సర్వవిద్యా  ప్రాప్తి -  వాక్శుద్ధి.


 వ్రాసిన  విషయాలలో అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.

.................................

* మహాశక్తి అయిన పరమాత్మ ..సూర్యుడు .

* ఓం.
అందరికి రధ సప్తమి శుభాకాంక్షలండి.

సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ.

దైవాన్ని చూపించండి ..... అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు. సూర్యుడు లక్షలాదిసంవత్సరాలుగా ఎలా వెలుగుతున్నాడో తలచుకుంటే ఎంతో ఆశ్చర్యం కల్గుతుంది.

అంతర్జాలంలో చూస్తే, ఇలా వెలగటానికి హైడ్రోజన్, హీలియం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువగా వివరాలు నాకు తెలియవు. ( నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు . )

సూర్యుడు అలా వెలగటానికి భౌతికంగా చెప్పుకునే కారణాలు ఏమైనా ఇవన్ని ఏర్పాటు చేసిన మహాశక్తి అయిన పరమాత్మకు మోకరిల్లి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుని వెలుగువల్లే భూమిపై జీవులు జీవిస్తున్నాయి.


సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.



శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.


లింక్ వద్ద..  




Wednesday, February 13, 2013

శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధములో...


ఓం    శ్రీ నగరేశ్వరస్వామి  శ్రీ వాసవి  కన్యకా పరమేశ్వరి దేవి..వీరికి  అనేక  వందనములు.

   శ్రీ  వాసవిదేవి  అమ్మవారి  మాహాత్మ్యము    గురించి  నిన్న  ఒక  టీవీ  చానల్ లో   సినిమా  ప్రసారమయింది.

 వాసవిదేవి చరిత్ర   నుంచి  గాంధీజీ  అహింసా  పోరాటానికి  స్పూర్తిని  పొందారేమోనని  అనిపిస్తుంది.

వాసవి కన్యకా పరమేశ్వరి  గురించి   శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము   గ్రంధములో  కూడా  చాలా  వివరములున్నాయి....


........Sripada Sri Vallabha - 1 - Webs.

 
శ్రీ   కన్యకా పరమేశ్వరి  దేవి  ........అహింసా  పద్దతిలో  దుష్టుడైన  రాజును  సంహరించటం  జరిగింది.

(
రాజు  యొక్క  దురాశకు  ఎక్కువమంది  సైనికుల  ప్రాణాలు  పోవటం  ఇష్టం  లేక ,  ఈ  అవతారంలో   అహింసా   సిద్ధాంతం  ద్వారా  మహా  రక్తపాతం జరగకుండా   వాసవిదేవి  అందరిని రక్షించింది . అని  అంటారు )

  ధర్మ  రక్షణ   కొరకు  దైవం  అనేక  అవతారములను  ధరించి  దుష్టులను  శిక్షించటం   జరిగింది. 

  ఆదిపరాశక్తి  అయిన  పరమాత్మ  యొక్క  అద్భుతమైన  వ్యూహరచనను  వివరించే  శక్తి  నాకు  అంతగా  లేదు  అయితే,     తోచినంతలో  ఏమనిపిస్తోందంటే......

  దైవం ,  లోకంలోని   పరిస్థితులను  బట్టి , విభిన్న  అవతారములలో   , విభిన్న  వ్యూహాలతో   దుష్టులను  శిక్షించటం    జరుగుతుంది . అని  తెలుస్తుంది.

వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

.....................

కొంతకాలం క్రిందట మాకు తెలిసిన వారి ఇంట్లో ఫంక్షన్ కు వెళ్తే , వారు మాకు.... శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము .... గ్రంధాన్ని మరియు  పిఠాపురంలో  ఉండే  గోపాల్ బాబా గారి క్యాలెండర్ ను ఇవ్వటం జరిగింది.

అప్పటి వరకు నాకు  శ్రీపాద శ్రీవల్లభ స్వామి గారి గురించి, గోపాల్ బాబా గారి  గురించి  తెలియదు. 

 
గోపాల్  బాబా గారి  గురించి  అంతర్జాలంలో  వివరాలు  వెతుకుతుంటే  ఇక్కడ  కొన్ని  వివరాలు  కనిపించాయి. 
 

Sriguru Gopal Baba Pithapuram - Dattatreya Lineage - Sonal Travels.


అంతా దైవం దయ. 



Monday, February 11, 2013

కొన్ని విషయాలు...


ఓం
  శ్రీ నగరేశ్వరస్వామి   శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ...వీరికి అనేక  వందనములు.
 ......................

గతకాలంలో  ఎక్కువమంది  ప్రజలకు  సామాజిక స్పృహ  ఉండేది.   ఈ  రోజుల్లో  ఎక్కువమంది  వ్యక్తిగతస్వార్ధానికే    ప్రాముఖ్యతను  ఇస్తున్నారు.

పూర్వం   ఎందరో  ప్రజలు   తమ  సుఖసంతోషాలను  త్యాగం  చేసి   స్వాతంత్ర్యాన్ని  సాధించారు.   సుభాష్ చంద్రబోస్,   భగత్ సింగ్,  చంద్రశేఖర్ ఆజాద్ .... ఇంకా  ఎందరో  వీరుల  త్యాగాల  వల్ల  దేశానికి  స్వాతంత్ర్యం  వచ్చింది.  


 ఈ  రోజుల్లో  కూడా  ఎందరో   సైనికులు  ఎండలో, వానలో, మంచులో ఎంతో  విపత్కర  పరిస్తితుల్లో  కూడా  విధులను  నిర్వహిస్తూ  దేశాన్ని  రక్షిస్తున్నారు.......ఇలాంటి  వీరసైనికులకు  వందనములు. 


  సైనికులు  దేశాన్ని  రక్షిస్తున్నారు  కాబట్టి  మనం   ప్రశాంతంగా    జీవించగలుగుతున్నాము.

వీళ్ళు   అంత  కష్టపడి  దేశాన్ని  ( ప్రజలను  ) రక్షిస్తుంటే   ప్రజలు   కూడా బాధ్యతాయుతంగా  ప్రవర్తించాలి
  కదా  !

అయితే,   సమాజంలో   చూస్తే,   కొందరు  మంచి  ప్రజలు  ఉన్నారు. కానీ,   కొందరు  అవినీతితో  కోట్లాదిరూపాయల  సంపదను  ప్రోగుచేస్తున్నారు.  కొందరు    విలాసాలలో  మునిగితేలుతున్నారు.
....................


రైతులు  ఎంతో  కష్టపడి  పంటలను  పండిస్తున్నారు. ఇతర  వృత్తుల  వారితో  పోలిస్తే  రైతులకు  వచ్చే  ఆదాయం  చాలా  తక్కువ.  అయినా  కూడా  వారు   వ్యవసాయం   చేయటాన్ని  ఆపకుండా  ప్రజలకు  ఆహారాన్ని  అందిస్తున్నారు. 

............................

ఉపాధి  కోసం  ఇతరదేశాలకు  వెళ్ళి ,  తిరిగి  మాతృదేశానికి    రావటానికి  కూడా  డబ్బు లేక  కష్టాలు  పడుతున్న  పేదవారి  గురించి   మీడియా  ద్వారా  తెలుసుకుంటున్నాము. 



 దేశంలోని పేద రైతులు,  పేద  కార్మికులు,  ఇతర  దేశాల  నుండి  తిరిగిరావటానికి  కూడా  డబ్బు  లేక  ఇబ్బందులు  పడుతున్న  పేదవారు .....వీళ్ళందరి  కష్టాలతో  పోల్చుకుంటే  సమాజంలో   చాలామంది  ప్రజలు  బాగానే  జీవిస్తున్నారు.


అయినా ,  తామే   జీవితంలో  చాలా  కష్టపడిపోతున్నామనుకుంటూ  చిన్నచిన్న   విషయాలకే  బాధపడుతూ , పంతాలు,  పట్టింపులను  ప్రదర్శిస్తుంటారు.


ఉదా......నచ్చినవారు  ప్రేమించలేదని  ఆత్మహత్య  చేసుకునేవాళ్ళు  కొందరయితే,... తనను  ప్రేమించలేదని  ఇతరులను  చంపేసేవారు  కొందరు,  చిన్నచిన్న  విషయాలకే  ఎప్పుడూ   కొట్లాడుకునే  భార్యాభర్తలు  కొందరు.


   సమాజాన్ని  పరికించితే   ఎన్నో  సమస్యలు  కనిపిస్తాయి. అయినా ,  మనం  కడుపు  నిండా  భోంచేసి,  చిత్రవిచిత్రమైన  సినిమాలను  చూస్తూ  హాయిగా  కాలం  గడిపేస్తాం. 


 సగం  దుస్తులు  వేసుకు  తిరిగే  హీరోయిన్(?) వెంటపడటం  తప్ప  వేరే ముఖ్యమైన లక్ష్యం లేని  హీరో పాత్రలు (?)  మనకు  ఆదర్శమా? 

జీడిపాకం  సీరియల్స్ లో  కనిపించే  వారి  కష్టాలను  తలుచుకుని  కడివెడు  కన్నీరు  కురిపిస్తాం. 


సమాజంలో  తిండిలేని  పేదవారు  ఎందరో  కనిపిస్తున్నా, మనం  ఇంకా ఇంకా  డబ్బును   పోగేసుకుని,    ఆనందిస్తాము. 

దేశంలోని  సమస్యల  గురించి    ప్రజలు  ఒకరిని  ఒకరు  తిట్టుకోవటం  కన్నా,  ప్రజలందరూ  బాధ్యతాయుతంగా  ప్రవర్తిస్తేనే,   దేశం  అభివృద్ధిపధంలో  పయనిస్తుంది.



Friday, February 8, 2013

1. కొన్ని విషయములు.2. విడాకుల వలన లాభమా ? 3. జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..

1.  కొన్ని  విషయములు.
ఇంతకు  ముందు  వ్రాసిన  పోస్ట్  లోని  విషయాలు  శ్రీ  దేవీ  భాగవతము . గ్రంధము  ద్వారా  తెలుసుకున్నవి.
..........................................


2. విడాకుల వలన లాభమా  ?

అసలు 90 శాతం మంది ఆడవాళ్ళు, 90
శాతం మంది మగవాళ్ళు ఒకే రకం  మనస్తత్వాన్ని  కలిగిఉంటారని  నా అభిప్రాయము.

కొంతమంది   స్త్రీలు  పురుషులు  తమ  జీవితభాగస్వామి నచ్చలేదని  భావించి   విడాకులిచ్చేస్తుంటారు. 


 ఇలా   పెళ్ళి  తరువాత  పెళ్ళి  చేసుకుంటుంటారు.  ఇలాంటివారికి  రెండు, మూడు పెండ్లిండ్లు  చేసుకున్నాక   అప్పుడు తత్వము  తెలిసివస్తుంది.  ఇక   అప్పుడు   మరిన్ని  వివాహాలు  చేసుకునే  ఓపిక  లేక    ఉన్నవారితో  సర్దుకుపోవటము నేర్చుకుంటారు.  తాము  జీవితంలో  చాలా సంతోషముగా   ఉన్నట్లు   ప్రపంచానికి   కనిపిస్తారు. (  నటిస్తారు. )


  ఈ సర్దుకుపోవటము మొదటి పెండ్లి  వారితోనే అయితే    కనీసము వారి   తల్లితండ్రులు,  పిల్లలు అయినా సంతోషముగా ఉంటారు కదా ! 

ఇక   ఇతరుల  జీవితాల్లోకి  మరీ తప్పని   పరిస్థితులలో భార్యాభర్త  విడిపోవలసి  వస్తే ,  విడిపోయి తమ  బ్రతుకు  తాము  బ్రతకాలి. ( ఇతరులను ఇబ్బంది  పెట్టకుండా..)  ఒంటరిగా  జీవించే  ధైర్యం  లేనప్పుడు  విడాకులు  తీసుకోకపోవటమే  మంచిది.

......................................

3. జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా ..? లేక  కొత్త అమ్మ నాన్న వస్తారా..?

ఈ రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటము ఎక్కువగా చూస్తున్నాము.   జీవితాంతం ఈ అమ్మా,నాన్న ఉంటారాలేక...... వారు విడిపోయి కొత్త అమ్మానాన్న వస్తారో తెలియని ...అతి చిత్రమయిన   పరిస్థితిలో(అభద్రతా  భావంతో  )  ఈనాడు  చాలామంది పిల్లలు  ఉన్నారు.

అంటే , తల్లితండ్రి  వేరే  వివాహాలు  చేసుకుంటే..పిల్లలకు  కొత్తా అమ్మానాన్న వస్తారు కదా !  


 ఒక   జంట గుర్తుంచుకోవాల్సింది   ఏమంటే......... 

మనము జీవితములో ,  చిన్నతనములో   పెద్దల మాట గౌరవిస్తాము. మరి మన ముసలితనములో మన కోడళ్ళను,  అల్లుళ్ళను   చచ్చినట్టు గౌరవించక తప్పదు. ఏమంటే అప్పుడు మనకు   ఒపిక ఉండదు కాబట్టి.  

 వృద్ధాశ్రమంలో  చేరినా  అక్కడున్న  వారికి  అణగిమణగి   ఉండవలసి  వస్తుంది. 

మరి,   జీవితములో ఎంత   మందితోనో  సర్దుకుపోతుంటాము.      ఆఫీసులలో ప్రక్కవారితోను  ,   ఇంటిప్రక్కవారితోను ,   పనివారితోను,   కూరలవారితోను, మన  సొంత పిల్లలతోను, ఇలా........ఎంతో మందితోనో   సర్దుకుపోతుంటాము.  

  (  మనకు ఇష్టము ఉన్నా,లేకపోయినా.) 


మరి భార్యాభర్తలు   కూడా   ఇలా   సర్దుకుపోతే  చాలా ప్రశాంతముగా ఉంటుంది. ముఖ్యముగా వారి పిల్లల  జీవితము ఎంతో  సంతోషముగా ఉంటుంది.



 కుటుంబం అన్నాక   ఎన్నో  కారణాల  వల్ల  భార్యాభర్తలకు   తప్పక   గొడవలు వస్తాయి. బయటివారికి   ఇవన్నీ ఉండవు    కాబట్టి  , బయటివారితో   ఇన్ని సమస్యలు రావు.



మనుషుల  మధ్య  అభిప్రాయ  భేదాలు  సహజం.  తల్లితండ్రి,  పిల్లలకు  మధ్యే  అభిప్రాయ  భేదాలు  ఉంటాయి..   అన్నదమ్ములకు,  అక్కచెల్లెళ్ళకు  మధ్య  అభిప్రాయభేదాలు  ఉంటాయి  .  ఎక్కడో  పుట్టి  పెరిగిన  భార్యాభర్తలకు  అభిప్రాయభేదాలు  రావటంలో  ఆశ్చర్యమేమీ  లేదు.

మన  పూర్వీకులు   తమ  మధ్య  అభిప్రాయ  భేదాలు  ఉన్నా  కూడా    విడాకులు  తీసుకోకుండా    సర్దుకుపోయారు   కాబట్టి,    మన   కుటుంబవ్యవస్థ  ఇంకా  చెక్కుచెదరలేదు. చక్కటి  కుటుంబవ్యవస్థలో   పిల్లలు  భద్రంగా  ఉన్నారు. 



  పిల్లలు  ఇంటికి వచ్చినప్పుడు  తమ   సొంత అమ్మకు   బదులు వేరే అమ్మ ,.......సొంతనాన్నకు  బదులు  వేరే నాన్న ఉంటే వారి మనస్సుకు   ఎంత  బాధగా ఉంటుందో   ఆలోచించండి.

మన  గురించి 
మన  పిల్లలు  గొప్పగా  చెప్పుకునేటట్లు  మన  ప్రవర్తన  ఉండాలి. అంతేకానీ   మన తరువాత  తరాల  వాళ్ళు   గిల్టీగా  ఫీలయ్యేటట్లు  మన  ప్రవర్తన  ఉండకూడదు  కదా !
...........................


  ఇక్కడ  ఒక   విషయం.  ...  కొందరి  విషయంలో   భార్యాభర్తలలో  ఒకరు  ఎంత  చక్కటి  ప్రవర్తనతో  ఉన్నా  కూడా,  రెండో  వారు  అహంకారంతో  తమ   జీవితభాగస్వామిని  వదిలి  వెళ్ళిపోయి  ఇంకో  వివాహం  చేసుకుంటున్నారు.   ఇలా  జీవితభాగస్వామి  వదిలి  వెళ్ళిపోయిన  సంఘటనలలో  చేసేదేమీ  లేక  ఇంకో  వివాహం  చేసుకుంటున్నారు.
....................


పూర్వకాలంలో   ఎక్కువమంది ,  సమాజం   బాగుండాలనే  తపనతో  తమ  వ్యక్తిగతసుఖాలను  కొంతమేర  త్యాగం  చేసేవారు.  ఇప్పుడు  సమాజం  ఎటుపోయినా  పరవాలేదు. వ్యక్తిగత  సుఖమే  ముఖ్యం . అనుకునే  వారు  ఎక్కువగా  కనిపిస్తున్నారు.  ఇందువల్ల  సమాజంలో   ఎన్నో  సమస్యలు  వస్తున్నాయి.
 

Wednesday, February 6, 2013

ప్రహ్లాదునికి జగన్మాత చెప్పిన కొన్ని విషయాలు.



ఒక  సందర్భంలో  ప్రహ్లాదుడు  జగన్మాతను  ప్రార్ధించి,   కొన్ని  సందేహాలను  అడగటం  జరిగింది.

అప్పుడు  అమ్మవారు  చెప్పిన  విషయాలలోని   కొంత  భాగం....


.....ప్రహ్లాదా  !.... అన్ని  శుభాశుభాలకూ  కారణం  కాలమే  కదా  !  వైరాగ్య  భావన  ఉన్నవారికి  ఎక్కడ  ఉన్నా  ఎప్పుడూ  సుఖమే.  లోభ చిత్తులకు  ముల్లోకాలూ  చేతికి  వచ్చినా  సుఖం  ఉండదు.  ఏ  ఫలాలూ  సంతృప్తినివ్వవు.........అంటూ  చెప్పటం  జరిగింది. 
.......................................

ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.







Monday, February 4, 2013

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని....

పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు .   

పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు.


వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


  శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


 ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


 మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు,......మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.

..........................................


అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

 కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు. 
.........................................

 వేదములలోని  కొన్ని  విషయాలు .....ఈ విషయాలు    అంతర్జాలంలో  సేకరించినవి.


 Before we begin our journey of solving the caste-puzzle through Vedas, let us start with certain worship mantras from Vedas that mention Shudras:


Yajurved 18.48:
O Lord! Provide enlightenment/ compassion to our Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. Provide me also with the same enlightenment so that I can see the truth.

Yajurved 20.17:
Whatever crime we have committed against my village, forest or committee; whatever crime we have committed through our organs, whatever crime we have committed against Shudras and Vaishyas, whatever crime we have done in matters of Dharma, kindly forgive us relieve us from the tendency of the same.

Yajurved 26.2:
The way I gave this knowledge of Vedas for benefit of all humans, similarly you all also propagate the same for benefit of Brahmins, Kshatriyas, Shudras, Vaishyas, Women and even most downtrodden. The scholars and the wealthy people should ensure that they not deviate from this message of mine
.***
 There are several shlokas in Manusmriti that state that a person belonging to high Varna falls down to level of a Shudra (uneducated) if he does not conduct noble deeds. For example,

2.104: A person who does not worship the Supreme Lord twice daily should be considered a Shudra.

2.172. He who has not been initiated with teaching of the Vedas is a Sudra.

4.245: A Brahmin acquires brilliance through company of noble persons and avoiding bad company. On contrary, if he indulges in bad company, he becomes a Shudra.


..................................

గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.

..........................


భీష్ముల  వారి  విషయంలో............

భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు   వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


  అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

 దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  



శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు.


పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.

....................................................

కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


 భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  


నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.   
జనకమహారాజులా.  


 నిష్కామ  కర్మతో  జీవించేవారు  ఆడంబరాలు లేకున్నా   క్రుంగిపోకుండా,  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు .
శబరిలా.

భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ. 


వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి  క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను .




Friday, February 1, 2013

ఎక్కువ, తక్కువ.....తారతమ్యం...

 ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
....................... 


 సమాజంలో   కొందరు  ,  ధనవంతులను  ఎక్కువగా   గౌరవిస్తున్నారు.  పేదవారిని  తక్కువగా  గౌరవిస్తున్నారు.   ఇంకా  ఎన్నో  విషయాలలో  మనుషుల  మధ్య   తేడాలను  చూపిస్తున్నారు. 

ఇలాంటి  విషయాల  గురించి  పురాణేతిహాసాలలోని   గొప్పవారు  ఎలా  ప్రవర్తించారో  పరిశీలిస్తే,   ఎన్నో  సంగతులు   తెలుస్తాయి.


శ్రీ  రాముడు  గుహునితో  స్నేహం  చేశారు. శబరి  అందించిన  ఫలాలను  స్వీకరించారు.
తాను  ఎక్కువ  ఇతరులు  తక్కువ  అనే  భేద  భావం  ఉండకూడదని  నిరూపించారు.



శ్రీ  కృష్ణుడు  తన  బాల్యస్నేహితుడైన  కుచేలుని  పట్ల  ఎంతో  ఆదరంగా  ప్రవర్తించారు.
 స్నేహానికి   పేద,  ధనిక  తారతమ్యం  ఉండకూడదని   నిరూపించారు. 



 పురాణేతిహాసాలలో  గొప్ప వ్యక్తులు  కొందరు  ఎన్నో  రకాల   వృత్తులను  నిర్వహించారు.

 హరిశ్చంద్రుడు  కొంతకాలం   కాటికాపరిగా  పనిచేశారు.

వాల్మీకి
మహర్షి, మహర్షిగా  మారకముందు  బోయవాడుగా  వేటాడుతూ  జీవించేవారు.

 వ్యాసమహర్షి  యొక్క   తల్లి  అయిన  సత్యవతిదేవి యొక్క  తండ్రి  ( పెంపుడు  తండ్రి )  పడవను  నడపటం,  చేపలను పట్టే  వృత్తులను   నిర్వహించేవారు.

పాండవులు   కొంతకాలం   విరాటుని  కొలువులో రకరకాల  వృత్తులను  నిర్వహించారు.

ఇవన్నీ  గమనిస్తే , మనకు  ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.

 పేద  వారిని  చిన్నచూపు  చూడకూడదని  ,  ఏ  వృత్తిని  చిన్నచూపు  చూడకూడదని  తెలుస్తుంది.

*************

పాతకాలంలో కొందరు స్వార్ధపరులు, ప్రాచీన గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వారు..శూద్రులను చిన్నచూపు చూసేవారు.అంటరానితనం అనే చెడ్డ విషయాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా శూద్రులు కష్టాలను అనుభవించారు.

 కాలక్రమేణా శూద్రులలో కూడా కొన్ని కులాలు ఏర్పడ్దాయి. కొందరు ఆర్ధికంగా అభివృద్ధి చెందారు. కొందరు ఆర్ధికంగా ఎదగలేకపోయారు. ఆర్ధికంగా ఎదిగిన శూద్రులలో కొందరు తమకన్నా ఆర్ధికంగా క్రిందస్థాయిలో ఉన్న శూద్రులను చిన్న చూపు చూడటం కూడా  జరిగింది.

 కొందరు శూద్రులు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న శూద్రుల పట్ల అంటరానితనాన్ని పాటించేవారు.

ఆధునిక కాలంలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 

 కొందరు ఏమంటున్నారంటే, ఆర్ధికంగా అడుగున ఉన్నవారు అన్ని కులాల్లోనూ ఉన్నారు కాబట్టి మాకూ రిజర్వేషన్లు కావాలంటున్నారు. 

 కొందరు ఏమంటున్నారంటే, పాతకాలంలో శూద్రులు వివక్షకు గురయ్యారు కాబట్టి, ఆర్ధికస్థితితో సంబంధం లేకుండా, కులాల ప్రకారమే రిజర్వేషన్లు ఉండాలని అంటున్నారు.

అలా అయితే, ఇప్పుడు శూద్రులలో ఉన్నతకులాలుగా గుర్తించబడిన కులాల వారి పూర్వీకులు వివక్షకు గురయిన వారే .. అందువల్ల ఇప్పుడు  శూద్రులలో అన్ని కులాలకూ రిజర్వేషన్లు ఇస్తారా? 

అన్నికులాల వారిలోనూ పేదరికంతో బాధలు పడుతున్న వాళ్ళెందరో ఉన్నారు.  పాతకాలమైనా, ఆధునికకాలమైనా, ఏ కులం వాళ్ళ పట్లా ఏ కారణం చేతనైనా వివక్ష ఉండకూడదు.

కొందరిని పైకి తేవటానికి మరికొందరి అవకాశాలను తగ్గించకూడదు. 

 ఒక ఉదాహరణ గమనిస్తే..  రిజర్వేషన్లు ఉన్న ఒక కుటుంబంలో తల్లితండ్రి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు.వారు ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు.

ఇంకొక కుటుంబం రిజర్వేషన్లు లేనివారు.. వాళ్ళు మధ్యతరగతికి చెందిన వాళ్ళు.

 రెండు కుటుంబాల వారి అమ్మాయిలు  ఉన్నత చదువులలో  సీటు సంపాదించడం కొరకు బాగా కష్టపడి చదివారు.  రిజర్వేషన్లు లేని అమ్మాయికి సీటు రాలేదు. రిజర్వేషన్లు ఉన్న అమ్మాయికి  సీట్ లభించింది. 

 తాను రిజర్వేషన్ లేని కులానికి చెందటం వల్లే తనకు సీట్ రాలేదని సీట్ లభించని అమ్మాయి వాపోవటం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనుషుల మధ్య అసహనం, కులాల మధ్య విభేదాలు పెరిగే అవకాశముంది. 

వెనుకబడిన వారిని పైకి తేవాలంటే ప్రభుత్వాలు వారికి ఆర్ధికంగా ప్రోత్సాహకాలు కల్పించాలి. ఉన్నత చదువులలో మెరిట్ ప్రకారమే సీట్లు ఇస్తే బాగుంటుంది.

 వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావటం ఎంతో అవసరం. వారికి ఆర్ధికంగా చేయూత నివ్వాలి. అదే సమయంలో రిజర్వేషన్లు లేని కులాలలో పేదవారికి కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి. 

అందరికీ సమాన అవకాశాలుండాలి.  అందరూ బాగుండాలి.ఎవరూ పేదరికంలో బాధపడకూడదు. సమాజంలో కులాల పేరుతో  వివక్షలు ఉండకూడదు.

 రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడి ఇన్నేళ్ళయినా.. దేశంలో పేదరికంతో బాధలు పడుతున్న వారెందరో ఉన్నారు.

పేదరికం పోకపోవడానికి సంపద కొందరి వద్దే ప్రోగుపడటం ముఖ్యకారణం. 

సమాజంలో అసమానతలు తగ్గాలంటే ఆర్ధిక అసమానతలు తగ్గాలి. మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వంతో ప్రవర్తించాలి. 
*******