koodali

Wednesday, September 5, 2012

ముహూర్తాలు...మరి కొన్ని విషయాలు.

 
ఓం.

శ్రీ  ఆదిపరాశక్తి పరమాత్మ  అయిన  శ్రీ లలితాదేవి వారికి..  అనేక  నమస్కారములు. 

జన్మనిచ్చి పెంచి  పెద్దచేసినందుకు   తల్లిదండ్రులను,  విద్యాబుద్ధులను  నేర్పించినందుకు  గురువులను   ఎంతో   గౌరవిస్తాం . (  ఈ  రోజు  గురు  పూజోత్సవం  సందర్భంగా   అందరికీ  శుభాకాంక్షలు  ) ఎవరైనా  మనకు    సహాయం  చేస్తే  కృతజ్ఞతలు  చెబుతాము.


 అలాగే ,  తరాల   తరబడి  భూమి  మీది  జీవులకు,   పీల్చే  గాలిని,    త్రాగటానికి  నీటిని,    సూర్యరశ్మిని,  చంద్రకాంతిని,  ఖనిజాలను  ..... ...ఇలా  ఎన్నింటినో  అందిస్తూన్న  మహాశక్తి  అయిన  దైవానికి  కృతజ్ఞతలు    చెప్పుకుంటాము.


 ఏదైనా  ముఖ్యమైన  పనిని  మొదలు   పెట్టేటప్పుడు  ఇంట్లోని   పెద్దవాళ్ళకు    చెప్పి  వారి  ఆశీర్వాదాలు  తీసుకుని  బయలుదేరితే  పిల్లలు  తమను  గుర్తు  పెట్టుకున్నారని  పెద్దవాళ్ళు    ఎంతో  సంతోషిస్తారు.

  పెద్దవాళ్ళకు  చెప్పకుండా  నిర్లక్ష్యం   చేస్తే   పెద్దవాళ్ళు   శపించరు  కానీ ,  తమను   పిల్లలు  మర్చిపోయారని   చిన్నబుచ్చుకుంటారు.


  అలాగే  ఏదైనా  ముఖ్యమైన   పనిని  ప్రారంభించేటప్పుడు   మనం  బ్రతకటానికి  కారణమైన   దైవాలను    గ్రహాధిపతులను  ప్రార్ధించి ,  మంచి  ముహూర్తం  చూసుకుని  పనిని   ప్రారంభిస్తే  వారి  ఆశీర్వాద  బలంతో  మనకు  మరింత  మంచి  జరుగుతుంది. 


 ఏ  పంచాంగమైనా  గొప్పదే. అన్నీ  దైవం  దయయే.   అయితే,   గౌరీపంచాంగం  ఎవరికి  వారుగా   ముహూర్తాలు  చూసుకోవటానికి  సులభంగా  ఉంటుంది. (  ప్రతి  విషయానికి  పండితులను  సంప్రదించటానికి   కుదరకపోవచ్చు.  ) 
 
  పంచాంగాలలో   సూర్యోదయ  సమయం  ఎప్పుడు  అనేది  వ్రాస్తారు.  

ఉదా...6 .00 సూర్యోదయం  అని  ఉంటే ,  అక్కడనుంచి  లెక్కవేసి  ముహూర్తం   చూసుకోవాలి.  (  నాకు  తెలిసినంతలో  ) .

   ఒక  ఉరికి  ఇంకొక  ఊరికి  సూర్యోదయ  కాలం  మారుతుంది. 

ఉదా... రాజమండ్రిలో వ్రాసిన   పంచాంగం లోని  సమయానికి , వేరే ఊరిలో   నివసించేవారు  తమ  గ్రామంలో  సూర్యోదయాన్ని బట్టి , కొన్నిసార్లు  కొన్ని  నిమిషాలు  +  కలపటం  కానీ,  కొన్ని  నిమిషాలు  -  తీసివేసి  గాని  లెక్కించుకోవాలి.


ఒకే  ఊరిలో  కూడా  సూర్యోదయం  ఎప్పుడూ  ఒకే  సమయానికి  ఉండదు.  కాలాలను  బట్టి  మారుతుంటుంది.
 
గౌరీపంచాంగంలో  ముహూర్తాలు  6 గంటలనుండి  మొదలయినట్లు  ఉంటుంది.  కానీ  ఏ  ఊరు  వారు  తమ  ఊరిలో  సూర్యోదయ  సమయాన్ని  బట్టి  ముహూర్త సమయాన్ని  లెక్కించుకోవాలి.


మామూలు  పంచాంగం  ప్రకారం    చూసేటప్పుడు  కూడా   ఇలాగే  తమ  ఊరిలో  సూర్యోదయ  సమయాన్ని  బట్టి  ముహూర్త సమయాన్ని  లెక్కించుకోవాలి.  
 
 
పనిమీద   వేరే  ఊరు   వెళ్ళినప్పుడు ,  మన  ఇంట్లోని   పంచాంగాన్ని    కూడా  తీసుకువెళ్ళినా , మనం  వెళ్ళిన    ఊరిలోని  సూర్యోదయ  సమయాన్ని  బట్టి ,  మన  దగ్గర  ఉన్న  పంచాంగంలోని  ముహూర్తాన్ని  సరిచేసుకోవాలి.

 పంచాంగం   చూడటం  విషయంలో    చాలా  మంది    పొరపాట్లు     చేస్తున్నారు.

  కొందరు,  తెల్లవారుఝాము  అంటే  ఈరోజు  ఉదయం  అని  అనుకుంటారు. తప్పుగా  ముహూర్తాలు  చూసుకుంటే  అన్నీ  తప్పులే  అవుతాయి.
 

 సూర్యోదయానికి కొంతకాలం ముందు తెల్లవారుఝాము..
సూర్యోదయం తరువాత సమయాన్ని ఉదయం ..అని వ్రాస్తారు.

ఉదా..6-30 సూర్యోదయం ఉన్నప్పుడు, ఆదివారం తెల్లవారు ఝామున 6-00 వరకు ఫలానా నక్షత్రం అని అంటే ..

.ఆదివారం తెల్లవారుఝామున (ఆదివారం రా.తె. 6.00 ) అంటే,  ఇంగ్లీష్ టైం ప్రకారం  సోమవారం మార్నింగ్ 6-00 వరకు.. అని అనుకోవాలి. (నాకు  తెలిసినంతలో).. 

(ఈ విషయాన్ని కొన్ని పంచాంగాలలో రా.తె. అని కూడా సూచిస్తారు. )

***************
 ఇప్పుడు  సమయాన్ని  నిమిషాలు,  సెకన్లలో  లెక్కిస్తున్నాము.

 కానీ, పూర్వీకులు  సెకన్ల   కన్నా   తక్కువగా  లిప్తలలో   కూడా  సమయాన్ని  లెక్కించేవారట.
 
    ఇంకో  చిత్రమైన  విషయమేమిటంటే ,  ప్రపంచంలోని   ఏ   ఒక్కరి  వేలిముద్రలు  ఒకేలా  ఉండవట.  ఎవరి  వేలిముద్రలు  వారికే   ప్రత్యేకంగా  ఉంటాయి. 

 మరీ  పట్టుదలలకు  పోకుండా   మనకు  చేతనైనంతలో    పంచాంగంలో  చెప్పిన  విషయాలను  పాటించుకుంటే  మంచిది. 


ఈ  రోజుల్లో  వివిధ  పంచాంగాలలో  వివిధ  సమయాలు    వ్రాస్తున్నారు.    ఏ  సమయాన్ని  పాటించాలో  తెలియక  సామాన్యులకు   గందరగోళంగా  ఉంటుంది.  

ఆధునిక  విజ్ఞానశ్శాస్త్ర   సిద్ధాంతాల  విషయంలో  శాస్త్రవేత్తల  మధ్య  భిన్నాభిప్రాయాలు  ఉంటాయి.  జ్యోతిశ్శాస్త్ర   సిద్ధాంతాలను   అర్ధం  చేసుకునే  విషయంలో  పండితుల  మధ్య   భిన్నాభిప్రాయాలు  ఉంటాయి.  ఎవరి  వాదన  సరైనదో  సామాన్యులకు  తెలియదు.  అందుకని  ఎవరు  ఏది   చెప్పినా  గుడ్డిగా  ఆచరించటం  కన్నా   ,    పరిస్థితిని   బట్టి     ప్రవర్తించటం    మంచిది. 


 మనకు  దిక్కుతోచనప్పుడు  దైవంపై  భారం  వేయటం  ఉత్తమం.

ఏ జాతకాలూ    తెలుసుకోకపోయినా    చెడుపనులకు    దూరంగా ఉంటూ,    సత్ప్రవర్తనను    కలిగిఉండి    దైవంపైన    భారం వేసి    జీవించే    వ్యక్తికి    దైవమే    సరియైన   దారిని   చూపిస్తారు.

నాకు  తెలిసింది  తక్కువ.  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దైవం  క్షమించాలని  ప్రార్ధిస్తున్నాను.

  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  తెలిసిన  వారు  చెబితే  సరిచేస్తానండి.



No comments:

Post a Comment