koodali

Monday, December 26, 2011

మనిషి కోతి నుంచి పరిణామం చెందటం........

 
సార్ Rao S Lakkaraju గారి బ్లాగులో పరిణామక్రమం గురించిన విషయాలు చదివాక నాకు కొన్ని సందేహాలు వచ్చాయండి.
 
జీవులలో పరిణామక్రమం గురించి డార్విన్ చెప్పినది నిజమే కావచ్చు. కానీ మనిషి కోతినుంచి పరిణామం చెందాడని ఎందుకు అనుకున్నారు శాస్త్రవేత్తలు ? అలా పరిణామం చెందినట్లయితే ఆ పరిణామం అతి నెమ్మదిగా జరిగింది కాబట్టి ఆ పరిణామక్రమాన్ని అనుసరించి వివిధ ఆకారాల్లో శిలాజాలు పెద్దమొత్తంలో లభించాలికదా ! ( అలా లభించలేదట )

ఒకవేళ శిలాజాలు లభించినా అవి మనిషివేనని ఏమిటి నమ్మకం ? మనిషికి దగ్గరి పోలికలున్న చింపాంజీలవి కావని ఏమిటి గ్యారంటి ? లోకంలో ఎన్నో పక్షులు, జంతువులు ఉన్నాయి. అవన్నీ ఏ పరిణామక్రమము లేకుండా డైరెక్ట్ గా పుట్టినప్పుడు సృష్టిలో గొప్పజీవి అనుకునే మనిషి మాత్రం కోతినుండి పరిణామం ఎందుకు చెందుతాడు ? ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి.



నేను నెట్లో కొన్ని వ్యాసాలు చదివితే నాకు అర్ధమయినంతలో ఏమనిపించిందంటే కోతినుంచి మనిషి పరిణామం చెందిన విషయంలో కూడా శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. కొందరు శాస్త్రవేత్తలు కూడా మనిషి కోతినుండి పరిణామం చెందలేదు అని గట్టిగా అంటున్నారట.

 కోతి నుండి మనిషి పరిణామం చెందినట్లు పెద్దమొత్తంలో శిలాజాలు దొరకలేదట. అతి తక్కువ శిలాజాల.. భాగాలు మాత్రం దొరికాయట.ఇది ఆశ్చర్యం కదా !

(ఆ శిలాజాలు మనిషివో ? చింపాంజీలవో ఎవరికీ తెలుసు? ) వీటన్నిటి బట్టి చూస్తే మనిషి కోతి నుండి పరిణామం చెందలేదని అనుకోవచ్చు. ఏది నిజమో ? ఏది కాదో ? పురాణాలలో మనిషి కోతి నుండి పరిణామం చెందినట్లు చెప్పబడలేదు. ( నాకు తెలిసినంతవరకు )
 
దశావతారాలను కొందరు పరిణామక్రమములో వర్ణించారు. అవి చదివి నేనూ అలాగే బ్లాగులో వ్రాశాను. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే, దశావతారములు పరిణామక్రమాన్ని సూచించవచ్చు.

కానీ, దశావతారాలలో పరిణామక్రమం రెండు విధాలుగా భావించవచ్చు.......

1. ఎలాగంటే ... మత్స్యావతారం ( నీటిలో జీవించే జీవి, ) కూర్మావతారం ( నీటిలోనూ లోనూ, నేలపైనా జీవించే జీవి, ) వరాహావతారం ( ఎక్కువగా నేలపైన జీవించే జీవి, ) నరసింహావతారాన్ని కొందరు ( సగం సింహం కాబట్టి మనిషిగా పరిణామం చెందుతున్నట్లుగా వర్ణించారు ? ) . ( కానీ ఇక్కడ నాకు సందేహం వచ్చింది. ) వామనావతారం ( పూర్తి మనిషిగా పరిణామం చెందటం, ) ఇక మిగతా అవతారాలు ( మానవ నాగరికత యొక్క పరిణామక్రమాన్ని వివరిస్తుందని ) కొందరు చెప్పారు. ఇది ఒక రకం భావన.....

2...రెండవ రకపు భావన ప్రకారం... నరసింహావతారం సందర్భంలో ప్రహ్లాదుడు వాళ్ళు సగం జంతువు, సగం మనిషి ఆకారాలలో వర్ణించబడలేదు కదా ! వాళ్ళు అసురజాతికి చెందిన వారు అనుకుంటా ? 


 అలా చూస్తే....
ఇక్కడ మనం ఏం అర్ధం చేసుకోవచ్చంటే ఈ అవతారాలు జీవుల పరిణామక్రమాన్ని సూచించటమంటే మత్స్యం నుంచి కూర్మం .... కూర్మం నుంచీ వరాహం పరిణామం చెందాయని అర్ధం కాదు.


అంటే మొదట మత్స్యావతారం ( నీటి లో జీవించే జీవి ) కూర్మావతారం ( నీరు మరియు నేలపై జీవించే జీవి ) వరాహావతారం ( ఎక్కువగా నేలపై జీవించేజీవి ) నరసింహావతారం ( మనిషి యొక్క ఆటవిక దశలోని జీవులు అంటే.. హిరణ్యకశిపుని వంటివారి జాతి యొక్క ఆటవికతను సంహరించే అవతారం ) వామనావతారం ( మనిషి నాగరికత పెరుగుతున్న దశ ) రామావతారం ( క్రమంగా రాజ్యాధికారం మరింత నాగరికత పెరగటం ) ఇలా కల్కి అవతారం వచ్చేటప్పటికి ప్రళయం వచ్చి సృష్టి అంతం అయ్యి మరల యుగారంభం ఇలా............అనిపించింది. ....
దీనిని బట్టి నాకు ఇలా సందేహం వచ్చింది .......

* కొందరు భావించినట్లు నరసింహస్వామి వారు మనిషి జంతువు నుంచి పరిణామం చెందినదానికి ఉదాహరణ కాకపోవచ్చు. . ........ నరసింహావతారం ( మనిషి యొక్క ఆటవిక దశలోని జీవులు అంటే.. హిరణ్యకశిపుని వంటివారి జాతి యొక్క ఆటవికతను సంహరించే అవతారం కావచ్చు. ) ఎందుకంటే అప్పటికే ప్రహ్లాదుడు వంటి ( శరీరం కల ) వారు ఉన్నారు కదా ! ఇంకా ప్రహ్లాదుని కాలంలో నరనారాయణులు తపస్సు చేసినట్లుగా కూడా చెప్పబడింది.

*..ఇలా ...... దశావతారాలు .. ఒక జీవ నాగరికత యొక్క పరిణామక్రమాన్ని సూచిస్తున్నాయి .....అంతేకానీ .....ఒక జీవి ఇంకొక జీవి గా పరిణామం చెందింది అని అర్ధం కాదు .


 దీనిని బట్టి చూస్తే మనిషి జంతువుల నుండి పరిణామం చెందలేదు. మనిషిమనిషిగానే దైవం చేత సృష్టించబడ్డారని అర్ధం చేసుకోవచ్చు.

నేను నా అభిప్రాయాలను మరింత స్పష్టంగా చెప్పలేకపోయాను అనిపిస్తోంది. వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను.



17 comments:

  1. ఇంత సుదీర్ఘమయిన వ్యాఖ్యను పెడుతున్నందుకు మన్నించాలి! మనిషి ఎలా వచ్చాడు అన్న విషయం మీద బోలెడు సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది దేవుడు సృష్టించాడు అంటే కొంతమంది ఆడ, మగ సంపర్కం వలన కలిగాడు అని చెప్పారు. ఆడ, మగ సంపర్కంలో కూడా ఆ రోజుల్లో చూసుకుంటే ఊహల ద్వారా (అంటే ఇక్కడ మానసిక సంపర్కం అనుకోవచ్చును), కేవలం చూచుట ద్వారా (ఆకర్షిత సంపర్కం), స్పర్శ ద్వారా (పార్శ్వపు శారీరక సంపర్కం), పూర్తి శారీరక సంపర్కం (ప్రస్తుతం అందరూ పాటించే విధానం) ఇన్ని రకాలుగా పిల్లలు ఉద్భవించే వారు. ఇహ దేవుడి సృష్టి చేసాడు అంతా, ఆడం, ఈవ్ మన పూర్వీకులని క్రైస్తవ ధర్మం కూడా చెపుతోంద఻. ఇదే కాక మనం శాస్త్రీయంగా చూసుకుంటే ఇంచుమించు ఒక చిన్న సైజు గ్రంధం అవుతుంది అన్ని రకాలుగా మానవుని ఆవిర్భావాన్ని చెప్తారు. ఒక anthropologist గా నేను చెప్పేది ఏమిటంటే. అకశేరుకాల నుంచి సకసేరుకాల దాక మనం గమనిస్తే అంతర్నిర్మాణ శాస్త్రంలో పరిణితి తద్వారా శారీరక పరిణితి కనిపిస్తుంది. వాటిల్లో ముఖ్యమయినదే పుర్రె నిర్మాణ క్రమం. మన పుర్రెలోనే కదా మరి మన మెదడు ఉన్నది. నాడీ కేంద్ర నిర్మాణం, వాటి అమరికని ఆధారంగా చేసుకునే మనకి పరిణితి అని చెప్పడం జరిగింది. ఈవిధంగా చూసుకుంటే మొదటినుండి protozoa, porifera, coelenterata, platyhelmenthis, nemetehelmenths, annelida, arthropoda, mollusca, echinoderata (అన్నీ అకసేరుకాలే), pisces, amphibia, reptiles, aves, mammals (అన్నీ సకశేరుకాలు). ఈ మామ్మల్స్లో కూడా మళ్ళీ చాలా విభజనలు జరిగి జరిగి మనిషి పుర్రెకి వచ్చేసరికి australopithecines, pithecanthropines, neanderthal men (వీళ్ళని సైన్సులో మొదటి మనుషులుగా గుర్తిస్తారు ఎందుకంటే ఇక్కడితో మనిషి అన్న రూపు, ఎదుగుదల అన్నీ వచ్చేసాయి), jawa men, cave men, ఇలా ఎన్నో రకాలుగా నాగరికతని పెంపొందించుకున్నాడు మనిషి. మీరు గమనించినట్లయితే neanderthal నించే మనిషి అనే మాటని పెడుతున్నాం.

    ReplyDelete
  2. మనిషి కోతి నుంచి పరిణామం చెందటం........

    అంతేనా మీ అనుమానం. దానికి డార్విన్ దాకా ఎందుకండి? మన బ్లాగుల్లో కొందరి వ్యాఖ్యలు చూస్తే స్పష్టంగా ఆధారాలు కనిపించడం లేదూ? :))

    ReplyDelete
  3. ee srushti ki modalu chivara telusukovatam impossible. we should just continue learning. thats all

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    పాపం కోతులతో పోల్చటం వద్దులెండి.అయినా నాలాంటి వాళ్ళను తిడితే ఏం లాభం ?

    రఫ్ గా వ్యాఖ్యానించే వారిలో కూడా రకరకాల వాళ్ళు ఉంటారనిపిస్తుంది.

    కొందరు తెలిసితెలియక మొదట ఇతరులను ఇబ్బందిపెట్టినా .... తరువాత పశ్చాత్తాపపడతారు. అలా పశ్చాత్తాపపడటం కూడా గొప్పవిషయమేనని చెప్పుకోవాలి. .

    మనం మాత్రమే కాకుండా ఇతరులు కూడా మంచిగా ఉండాలని .....,మనతోపాటూ వారికి కూడా మంచి జరగాలని దైవాన్ని ప్రార్ధించాలని పెద్దలు చెప్పారు.

    ఎందుకంటే మనం చేసే పనులే కాక ఇతరుల చర్యలు కూడా మన జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

    ఎలాగంటే ... ఉదా..ఒక దేశం అణుబాంబులను తయారుచేసిందనుకోండి. ఇష్టం ఉన్నా లేకపోయినా రక్షణకోసం. మిగతాదేశాలు కూడా తయారుచేయవలసి ఉంటుంది అందులో ఏ ఒక్కరు ఆవేశపడి యుద్ధం మొదలు పెట్టినా అందరూ సర్వనాశనం అవుతారు.


    అలాగే ఇద్దరు గొడవపడ్డప్పుడు , గొడవకు కారణం ఎవరైనా సరే, ఇద్దరి మనసులు ప్రశాంతతను కోల్పోతాయి.

    అందుకనే మనల్ని సరైన దారిలో నడిపించమని కోరుకోవటంతోపాటూ, ఇతరుల్ని కూడా సరైనదారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించాలి.

    ఏదో నా అభిప్రాయలు చెప్పాలనిపించి ఎక్కువగా చెప్పేసినట్లున్నాను. ఏమీ అనుకోకండి.

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమే మీరన్నట్లు ఈ సృష్టికి మొదలు తుదీ తెలుసుకోవటం అసాధ్యం. ఉదా..ఒక గుండ్రటి వృత్తాన్ని మనసులో ఊహించుకుంటే దానికి మొదలూ తుదీ చెప్పలేం. ..సృష్టి కూడా అంతేననిపిస్తుందండి.

    ఇక నా సంగతి ....నాకు గొప్ప పరిజ్ఞానం ఉందని నేను అనుకోవటం లేదు. ఏదో నాకు తోచినవిషయాలను ఇక్కడ చెప్పుకుంటున్నాను అంతేనండి.

    వాటిలో కొన్ని పొరపాట్లు కూడా ఉండవచ్చు.....

    ReplyDelete
  6. మనము మామూలుగా రెండు రకాల సిద్ధాంతాలని చూస్తూ ఉంటాము.
    మొదటి రకం శాస్త్ర పరం, శాస్త్రజ్ఞులు పరిశోధించి ఒక నిర్ణయానికి వచ్చే సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు పైకి రావాలంటే మిగతా శాస్త్రజ్ఞులు ఆమోదించాలి. శాస్త్రజ్ఞులు కావటానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది.

    రెండవరకం మత పరం. వారి వారి మతాలలో ప్రతిపాదించినవి
    వారు గట్టిగా నమ్మి వాటిని సిద్ధాంతాలుగా ప్రజలలో వ్యాపకానికి తీసుకు వస్తారు. వీటికి ఆమోద ముద్ర వేసే వారు మామూలు ప్రజలు అంటే మనలాంటి వారు.

    ఈ రెండూ సమాంతర రేఖలు గా అభివృద్ది చెందుతాయి. విడివిడిగా రెండిటినీ గట్టిగా నమ్మే వాళ్ళూ నమ్మించే వాళ్ళూ చాలా మంది ఉన్నారు. ఎక్కువగా ఎందుకనో రెండోవ రకంని నమ్మే వాళ్ళు, మొదటి రకం వాళ్ళని నమ్మించాలని చూస్తారు. వాళ్ళ చేత వప్పించాల్సిన అవసరం ఏమిటో తెలియదు. మనలో చాలా మంది అవీ నమ్ముతాం ఇవీ నమ్ముతాం. ఏ పుట్టలో ఏ పాముందో అని అన్నీ నమ్ముతాం, గుడికెళ్ళి దేముళ్ళ కి దణ్ణం పెట్టుకుని (ప్రసాదం) తరువాత గుళ్ళో ఇడ్లీలు, దోశలూ తింటాము (అమెరికాలో).
    మనము కోతులనుండి వచ్చినా ఎక్కడ నుండి వచ్చినా తినేవి తింటూ వుంటాము చేసేవి చేస్తూ ఉంటాము. వేటినీ నమ్మ వలసిని అవుసరము లేదు. వాటివల్ల ఒరిగే దంటూ ఏమీ లేదు (పరీక్షల్లో తప్ప). ఎవరి నమ్మకాలు వాళ్లవి.

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మనలో చాలా మంది అవీ నమ్ముతాం ఇవీ నమ్ముతాం. ఏ పుట్టలో ఏ పాముందో అని అన్నీ నమ్ముతాం,....కానీ,

    ఈ రోజుల్లో కొందరు హేతువాదులు, శాస్త్రవేత్తలు కూడా .... ప్రాచీన గ్రంధాలలోని విజ్ఞానాన్ని తక్కువగా మాట్లాడుతూ దైవం అంటూ ఎవరూ లేరు. ఆధునిక విజ్ఞానమే గొప్ప. అని ఇలా అంటున్నందువల్లే ఇలా చెప్పవలసి వస్తోందండి.


    ప్రాచీన కాలపు విజ్ఞానాన్ని, మనకు అందించిన పెద్దలను తక్కువగా మాట్లాడుతుంటే బాధగానే ఉంటుంది. ప్రాచీనకాలపు మహర్షులు కూడా ఒకరకంగా చూస్తే శాస్త్రవేత్తలే.


    ఆధునిక శాస్త్రవేత్తలు ప్రపంచానికి మంచి ఆవిష్కరణలను అందించారు. నిజమే. అందుకు అందరమూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ప్రపంచానికి ,పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఆవిష్కరణలను కూడా అందించారు. అలాంటివాటి గురించి మాట్లాడితే వారికి బాధ కలుగుతోంది.

    ** మరి ప్రాచీనులు కూడా మనకు ఎంతో విజ్ఞానాన్ని అందించారు. ఆ మహర్షులు ఎంతో శ్రమకోర్చి త్యాగాలు చేసి తపశ్శక్తితో కనుగొన్న విషయాలను మనకు తెలియచేశారు.

    మరి ప్రాచీన విజ్ఞానాన్ని తక్కువగా మాట్లాడటం, ఆ నాటి మహానుభావులను కించపరచటమే కదండి. ?

    ప్రాచీనమైన ప్రతివిషయాన్ని చాదస్తం అంటూ కొట్టిపారేసి ఈ నాడు కొందరు ఆధునికత పేరుతో సమాజంలో నైతికవిలువలను కూడా దిగజారుస్తున్నారు.

    * * అయితే నాకు జీవితానుభవాల ద్వారా తెలిసిందేమిటంటేనండి..... ఒక వ్యక్తిని గానీ , వ్యవస్థను గానీ మంచిగా మార్చాలంటే దైవం వల్ల మాత్రమే సాధ్యం....... అయితే అంతా దైవమే చూసుకుంటారులే అని కాకుండా మానవ ప్రయత్నం చెయ్యాలని అంటారు .

    ఈ మధ్య కొందరు శాస్త్రవేత్తలు కృత్రిమ కన్ను కనిపెట్టడం గురించి పరిశోధనలు చేస్తున్నారు . ఇలాంటి మంచి ఆవిష్కరణలను అందించే శాస్త్రవేత్తల వల్ల ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి ఆవిష్కరణలు కనుగొనాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

    మనం ప్రాచీన కాలపు విజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని రెండింటినీ గౌరవించాలి అని నా అభిప్రాయమండి. ఎక్కువగా వ్రాశానేమో దయచేసి తప్పుగా అనుకోవద్దండి..

    ReplyDelete
  8. నేను వ్రాసిన వ్యాఖ్య మీరెందుకు తొలగించారో తెలియదు! ఇబ్బంది పెడితే మన్నించాలి నా భావాలను వ్యక్త పరిచాను.

    ReplyDelete
  9. అయ్యో ! మీ వ్యాఖ్య ఇప్పుడే చూశానండి. ఇంతకుముందటి మీ వ్యాఖ్యను నేను చూడలేదు. మీ వ్యాఖ్యను తొలగించటానికి నా బ్లాగులో కామెంట్ మాడరేషన్ లేదు కదా ! సారీ అండి. ఏం జరిగిందో అర్ధం కావటం లేదు...

    ReplyDelete
  10. రసజ్ఞ గారి వ్యాఖ్య స్పాం(Spam) లోకి వెళ్ళిందేమో చూడండి.

    ReplyDelete
  11. Blogger.com లోకి వెళ్ళండి
    edit posts పక్కన comments అని ఉంటుంది క్లిక్ చెయ్యండి.
    Published Awaiting Moderation Spam అని పైన కనపడుతుంది. Spam ని క్లిక్ చెయ్యండి.
    దానిలో ఉన్నవి సెలెక్ట్ చేసి Not Spam క్లిక్ చెయ్యండి.
    మామూలు comments లోకి వస్తయ్యి.
    మళ్ళా edit Posts లోకి వెళ్ళి Comments క్లిక్ చేసి వాటిని సెలెక్ట్ చేసి pablish క్లొఇక్క చెయ్యండి.

    ReplyDelete
  12. రసజ్ఞ గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీ వ్యాఖ్య స్పాం లో వెతికితే కనిపించిందండి. ( Rao S Lakkaraju సార్ కు కృతజ్ఞతలు. )

    రసజ్ఞ గారూ... మీ అభిప్రాయం ప్రకారం సృష్టిలో జీవులు ఏకకణజీవి నుండి పరిణామక్రమం ప్రకారం మనిషి వరకు పరిణామం చెందారని మీ అభిప్రాయంగా అనిపిస్తోంది. అంటే ముందు ఏకకణజీవులు, సరీసృపాలు, పక్షులు, జంతువులు, మానవులు ఇలా పెరిగాయని మీ అభిప్రాయం అనుకుంటున్నాను. దీని గురించి నేను ఇంకా తెలుసుకోవలసి ఉంది. కశ్యపునికి జన్మించిన సంతానం గురించి ప్రాచీన గ్రంధాలలో ఏ విధంగా ఉందో నాకు తెలియదండి.

    కానీ కొంతకాలం క్రిందట .... శాస్త్ర విజ్ఞానం బ్లాగులో .... డార్విన్ గురించిన కధలో ..ఇలా వ్రాశారు...


    ఆధునిక విజ్ఞానం ప్రకారం జీవపరిణామ దశలతో సరిపోయే మరో ఆసక్తికరమైన కథ కూడా మహాభారతంలో కనిపిస్తుంది. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు. కద్రువ నాగులకి తల్లి. వినత పక్షులకి తల్లి. కద్రువ పెట్టిన వేయి గుడ్ల (!) నుండి వేయి పాములు పుడతాయి. అందులోంచి ఆదిశేషుడు, తక్షకుడు మొదలైన సర్పాలు వెలువడతాయి. వినత కాస్త ఆలస్యంగా రెండు గుడ్లు పెడుతుంది. అందులోంచి పక్షిరాజైన గరుత్మంతుడు, అనురుడు పుడతారు. ఆధునిక జీవపరిణామ వృత్తాంతం ప్రకారం ‘సౌరాప్సిడ్’ లు అనబడే జీవజాతిలో పాములు (సరీసృపాలు), పక్షులు రెండు ఉపశాఖలు. పైన చెప్పుకున్న కథలో పాములు, పక్షులు ఒకే తండ్రి బిడ్డలు కావడం ఈ పరిణామాత్మక సాన్నిహిత్యానికి చిహ్నంగా ఊహించుకోవచ్చు. పైగా ఆ కథలో పాములు కాస్త ముందు పుట్టడం కూడా విశేషమే. ఎందుకంటే పరిణామ చరిత్రలో కూడా సరీసృపాలు ముందుగాను, పక్షులు వెనుకగాను పుట్టాయి.వచ్చాడు అన్న విషయం మీద బోలెడు సిద్ధాంతాలు ఉన్నాయి.

    ఇదంతా పరిశీలిస్తే.........ప్రాచీనగ్రంధాల ద్వారా పెద్దలు మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు అనిపిస్తుందండి.

    ReplyDelete
  13. You must forgive me for answering in English. I feel more comfortable to present my views on the subject under discussion in English.

    Since there is limit for characters, I am dividing my post into separate parts.
    Part 1.
    "ఈ రోజుల్లో కొందరు హేతువాదులు, శాస్త్రవేత్తలు కూడా .... ప్రాచీన గ్రంధాలలోని విజ్ఞానాన్ని తక్కువగా మాట్లాడుతూ దైవం అంటూ ఎవరూ లేరు. ఆధునిక విజ్ఞానమే గొప్ప. అని ఇలా అంటున్నందువల్లే ఇలా చెప్పవలసి వస్తోందండి."
    I am afraid, there is a mix up of several ideas here.
    (1) It is fair to censure people who underrate or under value earlier knowledge however little it might be. Because the present knowledge was possible only because of that. Even Newton acknowledged it. (you can still question my taking Newton as authority)
    (2) Existence of God is a moot point. You can't condemn rationalists on that count. Because the scope of "god" is in the realm of philosophy and not science. It should be tackled differently. The faith of some scientists about his existence, however great the scientist might be, doesn't add any authenticity to it. Similarly, his faith in god does not make him a lesser scientist. They are totally different subjects and you cannot ‘by default’ accept one is good at science is equally proficient in philosophy or vice versa.
    Your wording gives a meaning that you accept whatever the scientists say enough if they express their belief in god. In science there is no room for personal faith. To put it in a lighter vein, you can call it a ‘collective faith’
    (3) Scientific temper doesn't accept one scientist or one invention greater than the other. It always attempts to search for truth accepting the best available knowledge of the day but always, repeat always, leaves room for improvement. The moment the present conflicts arising out of present beliefs are answered or resolved, it embraces the new theory. But, it knows there are associated or consequential problems and new contradictions in appropriating the new theory, and goes on working in that direction. You can't accept everybody as a scientist or his opinion valuable just because they have a tag. Their scientific outlook is important. This, again is difficult to ascertain.

    ReplyDelete
  14. Part 2
    ప్రాచీన కాలపు విజ్ఞానాన్ని, మనకు అందించిన పెద్దలను తక్కువగా మాట్లాడుతుంటే బాధగానే ఉంటుంది. ప్రాచీనకాలపు మహర్షులు కూడా ఒకరకంగా చూస్తే శాస్త్రవేత్తలే.
    There is absolutely no doubt about some of our ancestors (not necessarily Indian but whoever they come from on this globe) being great scientists. With absolutely no resources at their disposal, if they could develop mathematics, construct structures, predict astronomical phenomena, find cures in the nature, besides doing so many other things across the world thousands of years ago, who can deny them that status? And who cares for the opinion of the people who do not confer them such status? Why, even our Sage Viswamitra, is reputed to have replicated the creation in his own way. And there are still certain Brahmin communities which won't use the vegetables he created in certain functions.

    ఆధునిక శాస్త్రవేత్తలు ప్రపంచానికి మంచి ఆవిష్కరణలను అందించారు. నిజమే. అందుకు అందరమూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ప్రపంచానికి, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఆవిష్కరణలను కూడా అందించారు.
    While part of it comes under ethics, you can't blame science or scientists for inventions if some people misuse them. It is an ineluctable evil common with any other form of knowledge including philosophy.
    ప్రాచీనమైన ప్రతివిషయాన్ని చాదస్తం అంటూ కొట్టిపారేసి ఈ నాడు కొందరు ఆధునికత పేరుతో సమాజంలో నైతికవిలువలను కూడా దిగజారుస్తున్నారు.
    "చాదస్తం"... is practising a tradition's dictate rigidly without any knowledge of the principle behid it... and doing it to an excess. No field and no people are exempt from this weakness.

    Moral values:

    Science has nothing to do with the behavioural aspect of people. Degradation of values is a common complaint; though, I don't dismiss it as such. Society, its culture, traditions and ethos of the society come in here. The practical aspect of religion plays an important role here. If the moral fabric of the society tempered by its tradition and beliefs is strong, and the beliefs are self sustaining over centuries, that society can withstand the changes of time.If it is weak, the society breaks and the so called degeneration takes place.
    మనం ప్రాచీన కాలపు విజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని రెండింటినీ గౌరవించాలి అని నా అభిప్రాయమండి.
    Knowledge and not what passes off for knowledge whether it is modern or ancient should always be respected... without any rider.
    I am so sorry my post is too long. sincere apologies.

    ReplyDelete
  15. @teluguanuvaadaalu Sir: I think you presented very well, lot of our ideas who work in Science. Thanks.

    ReplyDelete
  16. teluguanuvaadaalu .... మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలండి.

    అయితే నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదండి. అందుకే మీ అభిప్రాయాలు నాకు సరిగ్గా అర్ధం కాలేదు. సారీనండి..

    ReplyDelete
  17. @ లక్కరాజు గారూ మీకు చాలా కృతజ్ఞతలండీ! మీ బ్లాగుకి తీరుబడిగా వస్తా అండీ పరీక్షలకి చదువుకోవాలి ప్రస్తుతం!
    @ anrd గారూ నేను చెప్పదలచుకున్నది మీకు సరిగ్గా అర్ధం కాలేదో నేను సరిగ్గా చెప్పలేకపోయానో తెలియదు కాని మళ్ళీ కాస్త తీరుబడిగా వస్తా దీని గురించి వ్రాయడానికి!

    ReplyDelete