koodali

Friday, June 10, 2011

ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది,

 

 

మానవ శరీరంలో ఆక్సిజన్ (65%), కార్బన్ (18% ), హైడ్రోజన్ (10% )నైట్రోజన్ ( 3% ) కాల్షియం ( 1.5 % ),ఫాస్ఫరస్ ( 1.0% ) ,పొటాషియం, సోడియం....ఇలా ఇంకా కొన్ని ఉంటాయట. వీటన్నిటితో శరీరం తయారవుతుందట.


విశ్వం అంతా కూడా ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. . ఇది అంతా బౌతికశాస్త్రం.... అంతే కానీ, దైవం అనిఎవరూ లేరు అంటారు కొందరు భౌతికవాదులు.

శరీరం ఆక్సిజన్, హైడ్రోజన్ వీటితో తయారయ్యే మాట నిజమే అయినా... ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది, ఎన్నో భావాలను కలిగి ఉంటుంది.


అలాగే విశ్వం ఆవిర్భావానికి మూలకారణమైన మూలశక్తి ( ఆదిశక్తి ) మనిషి కన్నా... ఎంతోఊహాతీతమైన శక్తి గల పరమశక్తి అని ఆస్తికులు నమ్ముతారు. శక్తినే వారు దైవంగా భావిస్తారు.


* కొన్ని ఎలిమెంట్స్ తో తయారయిన మానవులే ఎంతో ఆలోచనా శక్తిని కలిగి ఉన్నప్పుడు ,... అనంత ,విశ్వాన్ని , అందులోని అన్ని తత్వాలను తనలో కలిగి ఉన్న ఆదిపరమశక్తికి అనంతమైన ఆలోచనా శక్తి ఉంటుంది.

అందువల్లే సృష్టి అంతా ఒక పద్దతి ప్రకారం తయారు కాబడింది.
సృష్టిలో చూడండి ... ఏది ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఏర్పడి ఉంది.

అంటే .. ఒక పక్షి గాలిలో ఎగరాలంటే దానికి
ఎలాంటి శరీర నిర్మాణం ఉండాలో అలాగే ఉంది.

ఒక చేప నీటిలో ఈదాలంటే తోక, మొప్పలు ఎలా ఉండాలో అలాగే దాని శరీర నిర్మాణం ఏర్పాటు చేయబడి ఉంది.


మొక్కలు సూర్యరశ్మి నుంచి పత్రహరితం తయారుచేసుకోవటం ...ఇవన్నీ ఎంతో పద్దతిగా ఏర్పడి ఉన్నాయి .


పెద్దచేపకు ఆహారంగా చిన్నచేపలు, వాటికి ఆహారంగా, చిన్న ప్రాణులు, వాటికి ఆహారంగా ఆల్గే వంటివిఇలా............ ఒక పద్దతి ప్రకారం అద్భుతంగా సృష్టి రచన సాగిపోవటం చూస్తూనే ఉన్నాము.


కొందరు దేవుడు ఉంటే చూపించండి అంటారు. గాలిని మనం చూడగలమా ? కేవలం ఫీలవుతాము అంతే.


శాస్త్రవేత్తలు
విటమిన్స్ గురించి చెబుతారు. అవి ఉన్నాయన్నదీ నిజమే. a,b,c,D .విటమిన్స్... ..వీటిని చూడాలంటే కుదురుతుందా ?


ఒక వ్యక్తి ఉన్నాడు . అతనికి ఎందుకో మామిడిపండు అంటే ఇష్టం లేక పుట్టినతరువాత ఎప్పుడూతినలేదు. దాని రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదు.

వ్యక్తి మామిడిపండును తింటున్న తన స్నేహితునితో ఇలా అంటున్నాడు.

"మామిడిపండు రుచి ఎలా ఉంటుంది " ?

" తియ్యగా ఉంటుంది. "

"తియ్యగా అంటే పంచదార లాంటి తీపి రుచా ? లేక పనస పండు లాంటి తీపి రుచా " ?

" రెండూ కాదు. పంచదార తీపి రుచి వేరు, పనసపండు తీపి రుచి వేరు, మామిడి పండు తీపి రుచివేరు. "

"అంటే ఎలాంటి తీపి " ?

"ఎలాంటి తీపి అంటే . అలా చెప్పటానికి కుదరదు. నువ్వు కూడా మామిడి పండు తింటేనే రుచి నీకుసరిగ్గా తెలుస్తుంది."


అలాగే దైవాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవాలనుకొనేవాళ్ళు ... వాళ్ళు కూడా మార్గంలోపద్దతిగా ప్రయత్నిస్తే కానీ దైవాన్ని తెలుసుకోవటం కుదరదు.

శరీరం రకరకాల ఎలిమెంట్స్ తో తయారయింది నిజమే కానీఅందులో ప్రాణం, చైతన్యం, బుద్ధి , మనసుఇవన్నీ ఎలా ప్రవేశించాయో మనకు తెలియదు.


ప్రాణం శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో ? ఎలా నిష్క్రమిస్తుందో ?

కొన్ని విషయాలు తెలుసుకోవాలంటేబాహ్యేంద్రియాల శక్తి సరిపోదని అంతఃకరణ ద్వారా మాత్రమేతెలుసుకోగలమని పెద్దలు చెబుతున్నారు .


ప్రాచీనులు కొందరు, తపస్సు వంటి వాటి ద్వారా జీవుల పుట్టుకకుముందు., మరణానికి తరువాత జరిగేఎన్నో విశేషాల గురించి ,
ఇతరలోకాల గురించి ప్రాచీన గ్రంధాల ద్వారా తెలియజేసారు. వాటి గురించి తెలుసుకునేంతస్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.


పూర్వం కొందరు తల్లులు పిండాలను కుండలలో ఉంచి పెంచారు అని ప్రాచీన గ్రంధాలలో చదివివెక్కిరించిన వారే ...నేడు టెస్ట్ ట్యూబుల లో పిండాలను పెంచడాన్ని చూస్తున్నారు.

పూర్వం అభిమన్యుడు, ప్రహ్లాదుడు వంటి వారు తల్లుల గర్భంలో ఉన్నప్పుడే ఎన్నోవిషయాలునేర్చుకున్నారని చదివి వెక్కిరించిన వారే ... నేడు విదేశాల్లో కడుపుతోఉన్న తల్లులు కొందరు పుట్టబోయే పిల్లల కొరకు క్లాస్ లకు వెళ్ళి పాఠాలు వినటాన్ని చూస్తున్నారు.

అందుకని నా అభిప్రాయం ఏమిటంటేనండి, మనకు తెలియని విషయాలన్నీ అభూత కల్పనలుఅనటంసబబు కాదు.

భూమిపై మనకన్నా ముందు మనకన్నా ఎంతో గొప్ప నాగరికత కలిగి ,ఎంతో గొప్పవిజ్ఞానవంతులైనమానవులు నడయాడారేమో ?ఎవరికి తెలుసు ?

కొన్ని కారణాల వల్ల నాగరికత అంతర్ధానమైఉండవచ్చు గదా !

విశ్వం పుట్టిన ఇన్ని కోట్ల సంవత్సరాల్లో గత 200 సంవత్సరాల్లో పుట్టిన మానవులే గొప్పవాళ్ళు . ఆధునిక విజ్ఞానమే గొప్పది అనుకోవటం తప్పు

...................................................................
.
టపా రాసాక నాకు ఒక ఆలోచన వచ్చిందండి. రమణ మహర్షి గారు చెప్పినట్లు....... అసలు నేను అంటేఏమిటి ? అని. ఆక్సిజన్ వీటితో కూడిన శరీరమా ? లేక మనసా ? లేక ? నేను అంటే అసలు ఏమిటి ? ఏమో.........

అంతా దైవం దయ ....

 
.

7 comments:

  1. కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. You are right.
    But your comparision is wrong.
    It is impossible to compare religion technically! What do you say?
    -------------------------------
    అలాగే దైవాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవాలనుకొనేవాళ్ళు ................ వాళ్ళు కూడా ఆ మార్గంలో పద్దతిగా ప్రయత్నిస్తే కానీ దైవాన్ని తెలుసుకోవటం కుదరదు.
    -------------------------------

    ReplyDelete
  3. కృతజ్ఞతలండి.
    నా అభిప్రాయం ఏమిటంటేనండి. దైవం.సైన్స్ వేరు వేరు కాదు. దైవమే గొప్ప సైంటిస్ట్. ఎందుకంటే......... ఈ విశ్వాన్ని సృష్టించిందే దైవం. సైన్స్ అని చెబుతున్నవన్నీ అందులో భాగాలే .

    ఇక దైవాన్ని తెలుసుకోవాలనుకొనేవారు ఆధ్యాత్మికత మార్గంలోకి వచ్చి పద్దతిగా ప్రయత్నిస్తే తెలుసుకోవచ్చు..

    ReplyDelete
  4. కృతజ్ఞతలండి. అంతా దైవం దయ.

    ReplyDelete

  5. నేను చదివిన మరొక్క విషయం ఉదహరిస్తున్నాను. దశరథుని మృత శరీరాన్నిమంత్రులు మేనమామలదగ్గరికి దూరదేశం వెళ్ళిన భరతశత్రుఘ్నులు తితిగివచ్చేవరకు ,అలాగే సత్యభామ తనతండ్రి సత్రాజిత్తు మృతదేహాన్ని,శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర నుంచి తిరిగి వచ్చేవరకు,కుళ్ళిపోకుండా ఏవో తైలాలలో భద్రపరచారట

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీరు తెలియజేసిన విషయాలను గమనిస్తే, ప్రాచీనకాలంలో వాళ్ళకు తెలిసిన అద్భుతమైన విజ్ఞానం గురించి తెలుస్తోంది.

    ReplyDelete