koodali

Friday, April 30, 2010

కల కానిది నిజమయినది.....

ఈ మద్య నాకు ఒక కల వచ్చిందిలెండి.అందులో మా పొరుగూరి పెద్ద న్యాయమూర్తి ఒకరు ఒక సంచలన తీర్పు ఇచ్చారు. అది ఏమిటంటే నండి,మరి టీనేజ్ లోని పిల్లలు కలిసిమెలిసి ఎలా తిరిగినా చట్టప్రకారం తప్పు లేదని .నేను ఇలాంటి తీర్పు ఎప్పుడూ వినలేదు మరి.కల కాదేమో అనుకున్నాగాని కలయే.


ఇంకా మన సమాజములో చాలా జాతులలో ఇలాంటి అలవాట్లు ఉన్నాయి అని ఉదాహరణలు కూడా చెప్తున్నారు.... సమాజములో నేడు చాల మంది టినేజ్ వాళ్ళు కలిసి సహజీవనం చేస్తున్నారని కూడా సెలవిచ్చారు.

మరి నేటి సమాజములో చాల మంది నేరాలు,ఘోరాలు. కూడా చేస్తున్నారు. అలా అని అవి కూడా చట్టప్రకారము తప్పు కాదు అని .......దయచేసి అనవద్దు... అని నేను అంటున్నట్లు ...........................


నా భయం ఏమిటంటేనండీ చాలా జాతులలో ఇంకా చాలా విచిత్రమయిన అలవాట్లున్నాయి కదా...ఉదాహరణకు .:..దొంగతనము చేస్తే కాలో ,చెయ్యో విరిచెయ్యటము, ఇంకా కొన్ని తప్పులు చేస్తే జాతిబహిష్కారం ...... ఇలాంటివి అన్నమాట. మన పాత కాలములో ఇలాంటివి అమలులో ఉండేవి..మరి పెద్దలుసమాజములో ఇలాంటి వాటిని,ఉదాహరణలుగా తీసుకుంటే ,............ ముందు ముందు ఎలాంటి తీర్పులు చెప్తారో మా పొరుగూరి పెద్ద న్యాయమూర్తి...... ....


అప్పుడు నేను ఏమని అనుకున్నాను అంటే మోరల్ వాల్యూస్ కు,విలువ లేనప్పుడు ఇక న్యాయం , ధర్మం ,నైతికవిలువలు అన్న పదాలకు అర్ధం ఏమిటి! అప్పుడు ఇక న్యాయ మూర్తులు ఎందుకు అని... . ఇదండి నాకల.


నాకు ఏమని అనిపిస్తుందంటే అన్నింటికి ఆ సర్వోత్తమ న్యాయమూర్తి ఆ భగవంతుడే దిక్కు అని......... .. ..........

Wednesday, April 28, 2010

డాన్స్,డాన్స్,డాన్స్,..........................

ఒం, సాయి,సాయి.

రెండు,మూడు రోజులనుండి చానెల్స్ లో చిన్నపిల్లల ఆట ప్రొగ్రాంస్ గురించిన చర్చలు? మనము చూస్తున్నాము కదండి.ఏది ఏమైనా దేవి మేడం గారికి, సంద్య మేడం గారికి థాంక్స్ చెప్తున్నాను అండి.ఆ పిల్లల పేరెంట్స్ వాదన వింటుంటే నోరు తెరుచుకుని ఉండిపోయా నేను.మాకు లేని భాధ మీకు ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నారు గదా. అది o.k . మన భాధ ఆ ప్రోగ్రాంస్ చూసే బయట పిల్లల గురించి .


ఈ డాన్స్ చేసే పిల్లలు వాళ్ళ ఇంట్లో డాన్స్ చేయటము లేదు గదా!మన ఇంట్లో వచ్చే t.v. లలో చేస్తున్నారు మరి.ఆ ఎఫెక్ట్ సమాజము మీద పడుతుంది కాబట్టి. ఈ చర్చలో ఒకామె ఎంత ఆవేశములో ఉందంటే ఇక సంద్య గారిని కొట్టేస్తుందేమో అనుకున్నాను నేను. ఇలాంటి ప్రోగ్రాంస్ ను వ్యతిరేకించేవారిని అందరిని పడతీట్టిపోస్తూ ఆ ఆడవాళ్ళు ఎన్ని మాటలన్నారు.అబ్బో కాలం మారిపోయింది .నా లాంటి చాదస్తం వాళ్ళు నోరు మూసుకోవటము బెటరేమో అనిపిస్తుంది ఒకోసారి.



అసలు సినిమాలు ,సీరియల్స్ ,పేపర్స్ ఇవన్నీ గత కొన్ని ఏళ్ళుగా ఒక స్లో పాయిజన్ లాగా ఇలాంటి సంస్క్రుతికి అలవాటు చేశాయేమో అనిపిస్తుంది. ఎలాగంటే సినిమాలలో చూడండి, హీరో ఫుల్ సూట్ హీరోయిన్ చిన్న స్కర్ట్ వేసుకుంటారు. చూసి చూసి అవును తప్పెమిటి ఆడవాళ్ళుచిన్న స్కర్ట్స్ లే వేసుకోవాలి అనే స్టేజ్ కి వచ్చేస్తున్నాము. ఇలాంటి వాటిని ముందే బంద్ చేస్తే ఈ పరిస్తితి వచ్చేది కాదేమో.
ముందు ముందు చీరలు,పంజాబీ డ్రెస్స్, కట్టుకంటే వాంప్ అనుకునే పరిస్తితి కూడా రావచ్చు.

ఇక కుస్బూ లాంటి వారి గురించి ఏమి చెప్పగలం. అయితే వీళ్ళందరికి వాళ్ళ పిల్లలు పెద్దయ్యాక మాత్రమే సరి అయిన జవాబు దొరుకుతుంది.... అయితే ఒకోసారి మంచి వాళ్ళ పిల్లలు కూడా ఇలా అవటము ప్రారభ్ధము.....కొంతమంది తాము దారి తప్పి పక్కవాళ్ళెందుకు బాగుండాలని , వారిని కూడా చెడగొట్టెస్తుంటారు.......


అయితే కొసమెరుపు ఏమిటంటే చాలా మంది పిల్లలు బయట ఇంకా ఇలాంటి డాన్సెస్ నేర్చుకోవటానికి తల్లితండ్రులే పంపిస్తున్నారు. .... మనం చేయగలిగిందేమీ లేదు కల్చర్ మారిపోతోంది....ముందు తల్లితండ్రులే వీటి అన్నింటికి కారణము....... అనాధలకు కోంచెము సేవ చేసి ఆ తరువాత పబ్స్ లో డాన్స్ చేయటము నేటి లేటేస్ట్ కల్చర్........ . ... .........

Monday, April 26, 2010

దేముని కళ్యాణము,వేడుకలు వీటి గురించి ఇలా ఆలోచిస్తే .....

అందరికి నా నమస్కారములు అండి!

మనకు దేవుని గుడులలో జరిగే ఉత్సవములు ,దేవుని కళ్యాణములు ఇలాంటివి తెలుసుకదా! టి.విలలో కూడా చూస్తుంటాము. మనము అదొక వేడుకగా పాల్గొంటాము. నాకు ఆ మద్య టి.వి.లో అహోబిలం నరసింహస్వామి వారి కళ్యాణము ,మరియు తిరుమల ఇవి చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే,దీని వెనుక సమాజసేవ కూడా ఉందని.

ఎలా అంటే మనలో ఉన్నవాళ్ళు బాగా డబ్బు ఖర్చు పెట్టి ఫంక్షన్స్ ,పెండ్లి,ఇవి చేస్తుంటారు కదా! ఇలాంటివి చూస్తున్నప్పుడు పేదవారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి!వారికీ ఆశలుంటాయి కదా! వారికీ ఇలాగ ఫంక్షన్స్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఎలా....

ఇవన్నీ ఆలోచించి పెద్దవాళ్ళు ఇలా భగవంతుని ఫంఖ్షన్స్,పెండ్లి, తిరునాళ్ళు,జాతర, ఇలా ఏర్పాటూ చేశారేమోనని.... .ఆ దేవుని వేడుకలలో సామాన్యులు కూడా సరదాగా తమ ఇంట్లో ఫంక్షన్ లా, తమ ఇంట్లో జరిగే పెండ్లిలా, హాయిగా ఎంజాయ్ చేయొచ్చుకదండి.. వారి ఆశ తీరుతుంది కదా.పుణ్యము, పురుషార్ధం రెండూ కలిసి వస్తాయి.సామాన్యజనం పిల్లలు అర్ధ రాత్రి అయినా ఈ వేడుకలలో ఎంతో ఉత్సాహముగా పాల్గొనటము ఉండటము నేను చూశాను.ఇలా మన పెద్దలు ఇన్ని ఆలోచించి ఇలాంటి ఆచారములు పెట్టారని అనిపించింది.


ఇక దేవుని ఆరాధించటము అంటారా తప్పేముంది. మనము పీల్చే గాలి,త్రాగే నీరు ఆయన భిక్షయే కదా. ఇవన్నీ స్రుష్టించిన అసలయిన సైంటిస్ట్ ఆయన. అందుకు పూజ పేరుతో థాంక్స్ చెప్పటము తప్పా!మన తల్లి,తండ్రులకు మనము థాంక్స్ చెప్పటము లేదా!మనకు అవసరమయినప్పుడు మన పేరెంట్స్ను, సహాయము అడిగినట్లే ఆ భగవంతుని అడుగుతున్నాము.


ఒక తల్లి, తన పిల్లవాడు ఎక్కువ లడ్లు అడిగితే వానికి జీర్ణశక్తి ఉంటే ఇస్తుంది.లేకపోతే ఇవ్వదు. అలాగే భగవంతుడు మన అర్హతను చూసి మనము కోరినవి ఇస్తాడు.మనము మంచి ప్రవర్తన పెంచుకుంటే అన్నీ ఇస్తాడు.


ఇక ఆ భగవంతుని దగ్గర అందరూ సమానమే కాబట్టి దేవుని గుడి అందరిదీ. పురాణములలో ధర్మవ్యాధుడు, ఆదిశంకరాచార్యుల వారికి ఎదురయిన మహానుభావుల వంటి వారి నుంచి ఇది మనము చెప్పవచ్చు .....

సమాజములో దొంగాస్వాములు,మోసములు,ఇవి పోవటానికి,కృషి చేస్తున్న అందరికి థాంక్స్ చెబుతూ అలాగే దేవుడు అనే మహాశక్తి లేదని అనవద్దని కోరుతూ ........

Friday, April 23, 2010

మీడియాతో లాభాలే కాదు నష్టాలు కూడా..

ఫస్ట్ నేను,అందరికి థాంక్స్ చెప్పాలండి. మీయొక్క ఎంతో విలువయిన సమయము వెచ్చించి నా బ్లాగ్ ను చదువుతున్న అందరికి , సపోర్ట్ చేసిన కూడలి వారికి,మెనీ,మెనీ థాంక్స్ అండి. అది నా భాధ్యత కూడా.




ఇక మన మీడియా వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు ఉన్నాయని మనందరికి తెలిసిన విషయమే కదండీ. టి.వి చానెల్స్ వాళ్ళు రోజంతా ప్రసారం చెయ్యటము జనం ప్రాణం మీదికి వచ్చింది. వాళ్ళకేమో న్యూస్ కావాలి.


ఇక ఏదో ఒక పెద్ద మనిషి దగ్గరకి వెళ్తారు. మిమ్మల్ని ఫలానా ఆయన నిన్న తిట్టారు గదా మీ స్పందన ఏమిటని అడుగుతారు. అడగగా అడగగా ఏదో ఒకటి నోరు జారుతాము కదండీ!ఇక ఆమాట పట్టుకెళ్ళి అవతల ఆయన దగ్గర చెప్పి, ఇక మీ స్పందన చెప్పండి అంటారు. వాళ్ళు చెప్పేవరకు వెనకాల పడతారు. సహజముగానే ఏ బి.పి.నో పెరిగి వాళ్ళు నన్ను అలా అన్నారా వాళ్ళను ..................ఇలా మాటల ప్రవాహం సాగిపోతుంది ,.ఇక బోలెడు న్యూస్. పాపం జనం.



ఇక చాలా సీరియల్స్ విషయానికొస్తే మగవాళ్ళకి ఇద్దరు భార్యలు,లేక ఆడవాళ్ళకి ఇద్దరు భర్తలు, ఉంటారు అందులో వాళ్ళకి. అందరూ సరిగ్గా ఉంటే మరి కధ ఏమి ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశ్యము. ఇక కొన్ని సీరియల్స్లో కుటుంబసభ్యులు ఎప్పుడూ ఎవరో ఒకరికి గ్లాస్ లో విషము కలిపేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసిచూసి బయట అత్తా,కోడళ్ళు ఒకరినొకరు అనుమానముగా చూసుకోవాల్సిన రోజులొచ్చాయి.



కొన్ని సినిమాలలో ఒక ఆమె భర్తను వదిలేస్తుంది.ఒక ఆయన భార్యను వదిలేస్తాడు. విరు ఇద్దరు పెండ్లి చేసుకుని ఆదర్సమయిన జంటగా ఉన్నట్లు చూపిస్తారు. ఇది ఏమి ఆదర్సమో నాకు ఇంత వరకు అర్ధము కాలేదు.


ఇక కొన్ని చిన్నపిల్లల డాన్స్ ప్రోగ్రాంస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ళతో డ్యూఎట్స్ డాన్సులు,పాటలు,పెద్ద ఆరిందా మాటలు,వాళ్ళను చూస్తే చాలా భాధగా ఉంటుంది......

paapam news వాళ్ళు....నేను కూడా జాగ్రత్తగా ఉండాలి బ్లాగ్ రాయటములో............ .....

Wednesday, April 21, 2010

ఒకరి సంపద వంద కోట్లు, ఒకరి సంపద వంద నోట్లు.

మొన్న టి.వి లలో ఆ ఇంజనీరింగ్ అబ్బాయి అబిలాష్ ను చూసినప్పుడు చాలా భాధ అనిపించిందండి. కొద్ది కాలం క్రితము అతని ఫ్రెండ్ అదే యాక్సిడెంట్ లో చనిపోయాడు కదా ఎంతో భాధాకరం. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో ఆ భగవంతునికే తెలియాలి. ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ తో దేశానికి ఉపయోగపడవలసిన యువ ఇంజనీర్ ట్రీట్‌మెంట్ కొరకు ఇలా మనీ ప్రాబ్లం రావటము అత్యంత దురద్రుష్టము. అసలు ప్రభుత్వము వారు మొత్తము ట్రీట్‌మెంట్ చేయిస్తే ఎంత బాగుంటుంది.


మన దేశములో ఎంతోమంది మేధావులు ఉన్నారు. మన ఖర్మ కొద్దీ వాళ్ళు ఇక్కడ ఆదరించేవాళ్ళు లేక విదేశాలకు వెళ్ళిపోతున్నారు.మనమేమో అభివ్రుద్ది కోసం విదేశముల వారిని help అడుగుతాము. ఇది చాలా చిత్రముగా ఉంది కదండీ.జపాన్ చూడండి ఎవరి సహాయము లేకుండా రెండవ ప్రపంచయుద్దములో అంత దెబ్బ తిని కూడా ఎంత అభివ్రుద్ది చెందిందో.. వాళ్ళు విపరీతముగా పనిచేస్తారు. మనదేశములో విపరీతముగా దోచుకొనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు.



అసలు మన దేశము ఇంత దరిద్రములో ఎందుకు ఉందంటే , ఒకరి దగ్గర 100కోట్లు ఉంటే ఒకరి దగ్గర ఓటు తప్ప నోట్లు ,కోట్లు ఉండవు కాబట్టి. కొంత మంది ప్రపంచములో సొమ్మంతా వారి తరతరాలకి దాచి అత్యాశకు పోతున్నారు.

అసలు మనకు కావాల్సిన దానికన్న ఒక లిమిట్ దాటి సంపాదించుకోవటము మహా పాపము. ధనవంతులు చాలా మందికి కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది కాని కడుపు నిండా ఇష్టమయినవి తినలేరు.మనలో చాల మందికి ఏ షుగరు జబ్బో, బి.పి,జబ్బో ఉంటాయి. ఇంకా మనశ్శాంతి లేక ఎన్నో కష్టాలుంటాయి. అప్పుడు డబ్బు ఎక్కువ ఉండి కూడా ఏమి లాభము. అందరి సొమ్ము దోచుకునేవాళ్ళు వచ్చే జన్మలో బిచ్చగాళ్ళుగా పుట్టే చాన్సు ఉంది.

దయచేసి ధనవంతులు మరీ ఎక్కువు డబ్బు పోగు చేసుకోవటం మాని పేద వాళ్ళు కూడా పైకి రావటానికి సహాయపడితే ఎంతో పుణ్యము చేసిన వాళ్ళవుతారు. ఆ పుణ్యము వల్ల ధనవంతులకు కూడా జీవితములో ఎంతో సంతోషముగా ఉంటుంది. అంతే గాని పేదలను దోచుకుని భగవంతుని పూజ చెయ్యటము మహా పాపము.


ఈ ప్రపంచము మన ఒక్కరి కోసము కాదు. ఈ సంపద అందరితో కలసి మనము పంచుకోవాలి. అప్పుడు మాత్రమే పేదరికం ఉండదు........మనము ఇంకొకరికి సహాయము చేసినప్పుడు ఉండే త్రుప్తి ఎన్ని లక్షలున్నా,రాదు. ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. దయ చేసి ధనవంతులూ కొంచెము ఆలోచించండి. ప్లీజ్...............



మనము ఏదైనా కష్ట సమయములో రక్షించమని భగవంతుని అడిగితే , దానికి మన అర్హత, ఎంత కోట్ల ఆస్తి ఉందని ఆయన ఆలోచించడు. మనము ఎంత మందికి సహాయము చేశామని మాత్రమే ఆయన చూస్తాడు..................................

Monday, April 19, 2010

మీడియావలన లాభములు....

 
ఓం..ఈ రోజుల్లో మీడియా వల్ల కొన్ని నష్టాలు వున్నయి కానీండి,న్యూస్ పేపర్స్, టి.వి. న్యూస్, ఇంటర్ నెట్, ఇంకా ఇతరత్రా మన పాత తరం నాటి జానపద కళలు వీటన్నింటివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయండి. ఏమంటే ఎంత మంది గొప్ప వాళ్ళు ఎన్ని మనకు తెలియని విషయాలు చెప్తున్నారో.
 
 

లలితా సహస్ర నామములు విశిష్టత గురించి, వేద విజ్ఞానము ఇంకా ఇలాంటివి చూస్తుంటే ఆ పెద్దలు వాళ్ళ నాలెడ్జ్ వింటుంటే మరి ఎంతో ఆశ్చర్యముగా ఉంటుంది. లలితా దేవి గురించి పెద్దలు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు పెద్దలు శ్రీ మైలవరపు శ్రినివాసరావు గారు,పెద్దలు శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పేవి ఎంతో బాగుంటాయి.పెద్దలు శ్రీ గరికపాటి నరసింహారావు గారు,రచయితా శ్రీ వేమూరి వెంకటేశ్వర శర్మ గారు ,వీరందరూ చెప్పే విషయాలు కూడా చాలా బాగుంటాయి.అంటే ఇలా అందరి పేర్లు నేను ఇక్కడ చెప్పలేను కాబట్టి దయ చేసి క్షమించగలరు. ఇలాంటివి చెప్పే ప్రతి ఒక్కరు ఎంతో గొప్పవారు. సాయి,సాయి.
 

ఇలాంటి ప్రోగ్రాంస్ వినటము వల్ల నాలాంటి వాళ్ళము ఇలా కొంచెము అయినా తెలుసుకుంటున్నాము.అంతా ఆ భగవంతుని దయా భిక్ష,ఉదయము 5.30 కి వనితా టి.వి లో శ్రీ లలితే నమోస్తుతే ప్రోగ్రాం చాలా బాగుంటుంది. మళ్ళీ సాయంత్రము 5.30 కు భక్తి టి.వి. లో వస్తుంది .వీలు కుదిరిన వాళ్ళు దయ చేసి చూడండి.ఇలాంటివి ఇస్తున్న మీడియా వారికి థాంక్స్ అండి.
 

ఆ ఆదిపరాశక్తి లలితాంబ అర్ధనారీశ్వర తత్వముగా చింతామణి నివాసములోఉండే ఆ మహాదేవుడు మహాదేవి గా నేను అనుకుంటున్నాను....మన సంస్క్రుతిని చిన్నచూపు చూసే వారు దయచేసి ఇలాంటివి పెద్దల నుంచి చదివి గాని, వినిగాని, తెలుసుకుంటే అర్ధము అవుతాయి.. తప్పులుంటే క్షమించగలరు.. 
 
 
ఆ మర్చిపోయాను సారి...
ఇప్పుడు నేను చెప్పే పుస్తకం పేరు "ఒక యోగి ఆత్మ కధ" ఇది ఆ మధ్య ప్రపంచం మొత్తం మీద ముఖ్యముగా యూత్ చదివిన బుక్స్ లో ఒకటి అని న్యూస్."పరమహంస యోగానంద గారు" తాము స్వయముగా రాసిన ఆత్మకధ. నా లాంటి సామాన్యులకు తెలియని అద్బుత విషయాలు అందులో ఉన్నాయి. కొన్ని ఫోటోస్ ,ఉదాహరణలు కూడా ఉన్నాయి. కుదిరితే తప్పక చదవాల్సిన పుస్తకము. తెలుగు,ఇంగ్లీష్ లలో కూడా దొరుకుతుంది. ..........


Saturday, April 17, 2010

సంచార జివితము లాంటి మాది అసలు ఎ ప్రాంతం..

 

నేను ఇప్పుడు tranfersవల్ల రకరకాల రాష్ట్రములు తిరిగే మాలాంటి వారి కష్టాలూ గురించి రాయాలనుకుంటున్నాను అండి.కొన్నాళ్ళ క్రితం తెలుగు ప్రజలు నలుగురు కలిస్తే మామూలుగా మీది ఏ ఊరు ?ఇలా కుశల ప్రశ్నలు వేసుకునేవారు. కాని ఇప్పుడు ఏ ఊరు అంటే దిక్కులు చూడాల్సిన పరిస్తితి. ఏ ఊరు అని చెపితే ఏమి కొంప మునుగుతుందో ఎవరికి తెలుసు మరి.


పూర్వము native place అనేది ఎలా ఉండేదంటే అప్పుడు ప్రజలు వ్యవసాయము, వ్యాపారము వల్ల ఒకే ప్రాంతములో ఉండిపోయెవారు. మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వల్ల ఆఫీస్ వాళ్ళ ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్ళాల్సిన పరిస్తితి.మేము ఇలా తిరుగుతూ ఉండటము వల్ల మా పిల్లలకు మా సొంత ఊరు అంటే పెద్దగా తెలియదు. ఎప్పుడయినా వెళ్ళ్తుంటాము అంతే. పిల్లలకు వాళ్ళు పెరిగిన చదువుకున్న ప్రాంతము తోనే attachment ఉంటుంది .


మేము మా పై అధికారులతో మాకు వేరే రాష్ట్రము వద్దు భాష కూడా రాదు , కావాలంటే మా రాష్ట్రము లోనే వేరే ఊరు వెయ్యండి మహాప్రభూ...... అన్నా కూడా వారు వినరు , మాఖర్మ ప్రకారము ఏ ముంబయొ వేశారంటే ఇక మాపని అంతే................ వెళ్ళకపోతే వీళ్ళు ఊరుకోరు, వెళ్తే అక్కడ వాళ్ళు మీరు ఎవరు? మమ్మల్ని దోచుకోవటానికి వచ్చారా లేక మా సంస్క్రుతి పాడు అయిపోతుంది మీ వల్ల అని వాళ్ళూ చావగొడతారు........................... ............................



ఏమిచెయ్యాలి అలా అని ,ఆఖరికి సొంత ఊరు వెళ్తే అక్కడ పెద్దగా ఏమీ తెలియదు. మా లాంటి వారికి నేటివిటీ కి భాష ఒక్కటే ఆధారమేమో. ఇంకొ 50 సంవత్సరములలో ఇంగ్లీష్ పుణ్ణ్యమా అని అది కూడా ఉండదులెండి. లేదంటే మా పెద్దవాళ్ళ ప్రాంతమే మాప్రాంతమని( బేస్) అనుకొవాలి.

 

అసలు బిజినెస్సు పెరగాలంటే ఏ ఆఫీస్ వాళ్ళకయినా మంచిగా ఆప్రాంత ప్రజలతో వాళ్ళ భాషలో మాట్లాడాలి. ఉదాహరణకి బ్యాంక్స్ అనుకోండి,అక్క్డకు వచ్చేవారికి అందరికి ఇంగ్లీష్ రాదు కదా. ఇంకా బ్యాంక్ ఏమి అభివ్రుధ్ధి అవుతుంది.వీళ్ళుఅక్కడి భాష చచ్చీచెడీ నేర్చుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటాయి.


నేను ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే జనము మద్య ఈ గొడవలు ఉండవేమోనని.కాని ట్రాన్స్ఫర్స్ వల్ల మంచి కూడా ఉందండోయ్.అన్నీ ప్రాంతాల వారి మద్య స్నేహము పెరుగుతుంది.మేము అది వరకు ఆంధ్రాలో ఉన్నప్పుడు పేపర్స్ లో మన ప్రాజెక్టులు తమిళనాడు తన్నుకు పోయింది, కర్నాటక కాకిలా ఎత్తుకుపోయింది ఇలాంటి వార్తలు చదివి,ఇంత అన్యాయమా అనిపించేది. ఇప్పుడు ఏమి అనిపిస్తుందంటే వాళ్ళ తప్పేముంది. మనకి తెలివిగా చేతరాదు..వాళ్ళ భాష అన్నా వాళ్ళకి చాలా గౌరవము.మనకి ఇంగ్లీష్ అంటేనే ఇష్టము కదా మరి.మనము వాళ్ళ దగ్గర చాలానేర్చుకోవాలి.

 

మనకు ఏ ప్రాంతము ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాంతముతో అటాచ్మెంట్ పెరుగుతుంది. వాళ్ళతో friendship మనపిల్లలకు చదువు చేప్పే టీచర్స్, వీటన్నింటితో అనుభంధము ఏర్పడుతుంది. ఇక భగవంతుని ఆలయాలు ఎక్కడ ఉన్నా అవి అందరివీ కదా... మన జీవితములో మనము ఎక్కడ ఉంటే ఆ ప్రాంతము కూడా ఒక భాగము కదా మరి.


ఈ విధముగా ఒక ప్రాంతము ప్రజలు వేరే ప్రాంతము వెళ్ళటము వల్ల కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు.స్నేహము పెరగా వచ్చు....ఈ వెళ్ళటము ఒక లిమిట్ దాటితే అపార్ధాలూ పెరగవచ్చు. ఏది ఏమయినా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే ఈ గొడవలు రావు. కాని అదేదో సామెత చెప్పిన్నట్లు అన్ని ప్రాంతములు సమానముగా అభివ్రుద్ది చేసేవారే కనపడుటలేదు....అదే జరిగితే ప్రజలు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే హాయిగా ఉంటారు. వేరే చోటకి ఎందుకు వెళ్తారు?


సరే ఆఖరికి మా తెలుగు గాలి, మా తెలుగు మట్టి, మాతెలుగు తిండి, మాతెలుగు స్వర్గం అనుకుంటూ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ ఏమి అడుగుతున్నారంటే మీది ఏ ప్రాంతము రాయలసీమనా, కోస్తానా, తెలంగాణానా, ఉత్తరాంధ్రానా............ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉంటుందో విడిపోతుందో నాకు తెలియదు గాని మనము ఇలా ఒకరినొకరు తిట్టుకోవటము చాలా భాధగా ఉందండి...ఇలా తిట్టుకోకుండా గౌరవముగా సమస్య సాల్వ్ అయ్యే మార్గమే లేదా......మిగతా రాష్ట్రముల వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమోనని.



Tuesday, April 13, 2010

భగవంతుని బొమ్మని కాలిక్రింద తొక్కాను.

 

నా బ్లాగ్‌ను ఆదరిస్తున్న అందరికి థాంక్స్ అండి.
ఇక ఇప్పుడు నాకు భక్తి ఎక్కువే కానీఅండి, నేను హైస్కూల్లో చదివేటప్పుడు ఒక టీచర్ బాగా నాస్తికవాది దేవుడు లేడు అని చెప్పటానికి చాలా టైం తీసుకునేవారు. పాఠం తక్కువ చేప్పేవారు.ఇక నేను టీనేజ్ కదండి, బాగా బ్రేయిన్ వాష్ అయి దేవుడు లేడని డిక్లేర్ చేశేసుకున్నాను. ఇక ఫ్రేండ్స్ ముందు గొప్పకి దేవుడి బొమ్మలు కాలితో తొక్కి చూపించటము జరిగింది. ఇప్పుడు తలచుకుంటే చాలా భాధగా ఉంటుంది. 

 

ఇక చూడండి, ఆ తరువాత భగవంతుడు ఉన్నాడనటానికి ఆ దేవుడు నాకు బాగా బుద్ది వచ్చేటట్లు చేశాడు. క్లాస్ లో ఫస్ట్ రాంక్ లో ఉండే నేను ఫైయిల్ అవ్వటము కూడా జరిగింది. మనము అహంకారముగా ప్రవర్తించితే మరి పెద్దవాళ్ళు మంచి దారిలోకి తెస్తారు గదా అలాగన్నమాట. భగవంతుని నమ్మటము వల్ల మనకే లాభం. కష్టాలలో ఉన్నప్పుడు మనకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. 

 


మనకు,మంచిగా కళ్ళూ, చేతులు,ఇలా మంచి అవయములు, తినటానికి ఆహారం ఇవన్నీ ఇచ్చిన,భగవంతుని మనము మరిచిపోతే మనమే తప్పు చేసిన వాళ్ళము అవుతాము.మనకు ఎన్నో జన్మల నుండి తోడు ఉండే ఆత్మ బందువు ఆ భగవంతుడు. . . .



మనము ఒక కలెక్టర్ ను కలుసుకోవాలంటేనే ఎన్నోరూల్స్ పాటించాలి.మనకి పని ఉంటే పై ఆఫేసర్ ని విపరీతముగా పొగుడుతాము.అలాంటిది ఎన్నో వేల సంవత్సరాలనుంచి మనకు కనపడుతూ మనకు బ్రతుకు ఇస్తున్న ఆ సూర్యునికి గాని,వేల కోట్ల సంవత్సరాలనుంచి స్రుష్టిని నడిపిస్తున్న ఏ శక్తిని అయినా భగవంతునిగా నమస్కరిస్తే తప్పేమిటి...ఇలాగే ఆ భగవంతుని నమ్మి మనము అందరము సుఖముగా ఉండాలి..
 

 

నేను ఏమనుకుంటానంటే ఎవరికయినా ఒకోసారి జీవితములో అత్యంత క్లిష్ట పరిస్తితులు ఎదురవుతాయి.అప్పుడు మన తెలివి తేటలు,ధైర్యము, ఏమీ పని చేయవు. అప్పుడు మనము ఏమి చెయ్యాలంటే మన శక్తి ఉన్నంతవరకు ట్రై చేసి ఇక భగవంతుని మీద భారము వేస్తే మనకు ప్రశాంతముగా ఉంటుంది. నేను ఒకసారి ఇలాగే చేశాను అప్పుడు అత్యంత విచిత్రముగా ఆ ప్రోబ్లం తీరిపోయింది.అంతకు ముందు ఆ సొల్యూషన్ నాకు తట్టలేదు.

అలాఎన్నో సార్లు ఆయన నన్ను ఆదుకున్నాడు. ఆ విధముగా భగవంతుని నమ్మే విధముగా చేసి, ఆయన నన్ను మంచి మార్గము లోకి తెచ్చారు. .... కామెంట్స్,,చూసాక ఇలా రాయాలనిపించింది...........................


జన్మ ఎత్తిన ప్రతి వారికి పూర్వ జన్మలో చేసిన పాపాల వల ఎన్నోకష్టాలూవస్తాయి.మనకు ఏదైనా రోగము ఉందనుకోండి, డాక్టర్ ను నమ్మితే మనకే జబ్బు తొందరగా తగ్గుతుంది.అలాకాకుండా డాక్టర్ ను తిట్టి ఆయన్ను నేను నమ్మనంటే మనకే నష్టము.అల్లాగే జన్మ ఎత్తగానే రోగాల్లాంటి ఎన్నో కష్టాలూ మనకి ఎదురవుతాయి. డాక్టర్ లాంటి భగవంతుని నమ్మితే మనకే లాభము.మనకి స్వశక్తి ఉందని మనము అనుకుంటాము గాని అశక్తి కూడా ఆయన దయే.



ఉదాహరణకి ఒక్కోసారి కొంతమంది ఆరోగ్యముగాఉన్నవాళ్ళు వాళ్ళ పూర్వ ఖర్మ ప్రకారము తెల్లవారేసరికి ఏ యాక్సిడెంట్ లోనో కాలో చెయ్యో పోగొట్టుకుంటారు. అప్పుడు వాళ్ళని చూస్తే మనకు మన చేతిలో ఎమీ లేదు అనిపిస్తుంది.,


అందుకనే నే భగవంతుడు నన్ను శిఖ్షించాడు అనుకోవట్లేదు. మన తల్లితండ్రిని తిడితే ఎంత తప్పో ఎన్నో జన్మల నుంచి మనలను కాపాడుతూ మనసుఖం కోసము తాపత్రయ పడుతున్న ,మనకు ఆహారము ఎర్పాటు చేసిన భగవంతుని తిట్టడమూ అంతే తప్పు.ఆ తప్పు ఇంకా ఎక్కువ చేయకుండా నన్ను చిన్న మందు ఇచ్చి డాక్టర్ లా రక్షించాడనుకుంటున్నాను..... .తప్పు పని చేసిన వాళ్ళని కొంచెము అయినా పనిష్ చెయ్యకపోతే మంచి వాళ్ళు కూడా తప్పులు చేస్తారు.... . 

 

చిన్నప్పుడు మనము డాక్టర్ దగ్గరకు వెళ్ళము,పెద్దవాళ్ళు ఎంత నచ్చచెప్పినా మనము వెళ్ళము అలాటప్పుడు మనల్ని ఒక దెబ్బ కొట్టి అయినా తీసుకెళ్తారు. మనమంచి కోసమే కదండి. మన జబ్బులు కుదరాలంటే డాక్టర్ ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకోవాలి,పథ్యము సరిగ్గాచెయ్యాలి,ఇంకా మన జబ్బు స్టేజ్ నుబట్టి మన రోగాలు తగ్గుతాయి. అలాగే మన కష్టాలు తీరాలంటె దేవుని నమ్ముతూనే మనము సత్ప్రవర్తన కలిగివుండాలి. అప్పుడే మన పూర్వ పాపాలు పోయి కష్టాలు ఉండవు... ......మనము మధ్యలో ఇంజెక్షన్లు, ఆపరేషన్లు ఇలాంటి వాటికి భయపడి పారిపోకపోతే కష్టాలు పూర్తిగా పోతాయి.............



Monday, April 12, 2010

ఆనందం బ్లాగ్ పరిచయము నా పేరు ఆనందం ........అందరు ఆనందముగా ఉండాలని నా కోరిక......

 

అందరికి నమస్కారములు. నా బ్లాగ్ పేరు ఆనందము అండి. నేను పరిచయము చేసుకోవటానికి పేద్ద గొప్ప విషయము ఏమీ నాకు లేదు ఏదో నాకు తెలిసినవి నాభిప్రాయములు అందరికి చెప్పుకోవాలని ఈ చిన్ని ప్రయత్నము. నేను బ్లాగ్ రాయటము నాకే ఆశ్చర్యముగా ఉంది. ఏమంటే నాకు కంప్యుటర్స్ నాలేడ్జ్ చాలా తక్కువ. . ఏదో కొంచెం కొంచెం నేర్చుకుని భగవంతుని దయవల్ల ,మీ అందరి సహకారము వల్ల ఈమాత్రము రాస్తున్నాను.

 

కూడలి వారికి, నాబ్లాగ్ చదువుతున్న అందరికి నా థాంక్స్ చెప్పటానికి ఇది రాస్తున్నాను. అందరి అభిప్రాయములు ఒకలా ఉండవు కదా.అందుకని నా రాతల నుంచి ఎవ్వరినయినా భాధ పెడ్తే క్షమించండి. నేను రాసే వాటి వల్ల ఏ జీవికి చెడు జరగకుండ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్దిస్తున్నాను.మీకు ఇదంతా చాదస్తముగా ఉండి నవ్వు వస్తుందేమో...ఏదో నాకు సెంటిమెంట్స్ కొంచెము ఎక్కువ. నాకు నలుగురితో మాట్లాడటము అంత బాగా రాదు. ఇప్పుడిప్పుడే కంప్యూటర్స్ కొంచెం నేర్చుకుంటున్నాను. బ్లాగ్స్ అందరూ చాలా బాగా రాస్తున్నారు. ఎన్నో కొత్త విషయములు తెలుసుకుంటున్నాము. నా బ్లాగ్ కూడా చదువుతారని ఆశిస్తూ............. 

 

Monday, April 5, 2010

మేము అమర్‌నాధ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు బాగా సహాయము చేశారు.

 
ఈ పోస్ట్ బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలో వ్రాశానండి. మళ్ళీ ఇప్పుడు తిరిగి పోస్ట్ చేస్తున్నాను.

మా కుటుంబం క్రితం సంవత్సరము.... బాబా అమర్‌నాధ్ , మాతా వైష్ణవి దేవి యాత్రకు వెళ్ళాము.అక్కడ చెప్పలేనంత బాగుంది.ఆ భగవంతుని దయవలన మావంటి సామాన్యులకు కూడా ఇంత అదృష్టము దక్కింది.


అక్కడ ముస్లిం సోదరుల సహాయము మేము మరిచిపోలేము. వారు మమ్ము చాలా బాగా చూశారు. ఇంకా మా యాత్రకు సహాయము అందించిన ప్రతి ఒక్కరికి మా క్రుతజ్ఞతలు.


అమర్‌నాధ్ బాబా గుడి కనిపెట్టింది ఒక ముస్లిం సోదరుడు. అక్కడ గుడి దగ్గర షాప్స్ లో పూజా సామాగ్రి ముస్లిం సోదరులు కూడా అమ్ముతారు.మాకు ఇదంతా ఆశ్చర్యముగా ,ఆనందముగా అనిపించింది.


నాఉద్దేశ్యములో అమర్నాధ్ గుహ ను ఒక ముస్లిము సోదరుడు కనిపెట్టడము చూస్తే భగవంతుడు అన్ని మతములవారు మంచిగా కలసి ఉండాలని సందేశము ఇచ్చారేమో అనిపిస్తుంది.

ఇంకా సాయిబాబా కూడాఇదే చేప్పారు. అయ్యప్పస్వామికి వావర్ అనే పేరున్న ముస్లిం మిత్రుడు ఉన్నట్లు, వారి యొక్క గుడి శబరిమలలో ఉందంటారు. ఏసుప్రభువుకు, హిమాలయములలోని మహావతార్ బాబాజీకు స్నేహంఉందని ఈ మధ్య కొన్నిపుస్తకములలో వ్రాసారండి. .

పెద్దవాళ్ళు ఇలాచెప్తుంటే మనము ఎందుకు కొట్టుకోవాలి.మతమేదయినా భగవంతుడనే ఆ మహాపవర్ ను అందరు ఆరాధించొచ్చు.


అక్కడ ఒక ఆర్మీ అతను మా తెలుగు మాటలువిని,మీరు తెలుగు వాళ్ళా అని ఆప్యాయముగా అడిగాడు. ఏ రాష్ట్రము వాళ్ళయినా వాళ్ళు కుటుంబానికి దూరముగా సరిగ్గా తిండి,నిద్ర లేకుండా త్యాగము చేస్తున్నందువల్లే మనలాంటివాళ్ళము ఇలా ఉన్నాము.


పొలీసులది కూడా ఇలాంటి త్యాగమయిన ఉద్యోగమే. వీళ్ళందరూ ఎక్కువమంది మద్యతరగతి కుటుంబాలనుండే వస్తారు. నాకు అనిపిస్తుంది,కొంతమంది దేశాన్ని దోచుకొనే వాళ్ళు హాయిగా విలాసాలులో బ్రతుకుతున్నారు. ఇదంతా చాలాభాధగా ఉంటుంది. పేదరికం మన ప్రపంచము నుండి ఎప్పుడు పోతుందో..


  స్రుష్టిలో రకరకాల మనుష్యులు ఉన్నట్లే ఎన్నిమతములు ఉన్నా అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.

ఆర్మీ వాళ్ళను చూసినప్పుడు వీళ్ళింతకష్టపడుతుంటే మనము ఇంట్లో టివి చూస్తూ ,బయట ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాము కదా మనము అని సిగ్గనిపించింది. ఇక మతము విషయానికి వస్తే ఒకే మతములో వాళ్ళు కూడా గొడవలు పడతారు.

 ఈ ప్రపంచములో అంతా  ఒకే మతము  ఉండటము అనేది  ప్రస్తుతానికి  జరగని  పని.
 మతము  అనేది    అసలు   లేకుండా పోవటము   అనేది  ఎప్పటికీ  జరగనిపని.

అందుకని అందరము ఆనందముగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవటము ఒకటే మార్గము.మన యువత ప్రపంచాన్ని మంచిగామార్చాలి.


  భగవంతుడు అందరికి మంచి బుద్దిని కలిగించాలి. ... ........



Friday, April 2, 2010

అందరు ఆనందముగా ఉండాలి ........

ఇక ఈమద్య మన రాజకీయములు చూస్తే ఒకటీ బాగా అర్ధము అయ్యింది .ఇప్పుడప్పుడే మన దేశం బాగు పడదని.చక్కగా కలిసి ఉన్న తెలుగు వారు ఒకేఒక్క నెల ప్రాంతీయభేధాల వల్ల ప్రజలలో ఒకరినిఒకరు విపరీతముగా ద్వేషించే పరిస్తితి ఎలావచ్చిందో చాలా ఆశ్చర్యముగా ఉన్నది. మన దేశాన్ని అభివ్రుద్ది లేకుండా చేయాలంటే ప్రాంతీయ భేధాలు తెస్తే చాలు అని మాత్రము అర్ధమయ్యింది.

మన తెలుగు వాళ్ళం మనలో మనము వేరే ప్రాంతము రాకూడదు అంటే మనవాళ్ళూ వేరే రాష్ట్రములు, దేశములు ఉద్యోగముల కోసము వెళ్తున్నారు కదా.ఇప్పుడు ఇలా అనే వారుఇక ముందు ఎప్పుడు విదేశాలకు వెళ్ళకుండా ఉంటారా..అక్కడ ఉన్నవాళ్ళు తిరిగి వచ్చేస్తారా.. ..
అన్ని ప్రాంతములు సమానముగా అభివ్రుద్ది అయితే ఇన్ని గొడవలు వచ్చేవి కాదు.


తెలంగానాకు ,రాయలసీమకు,ఉత్తరాంధ్రాకు,నీళ్ళ ప్రాబ్లం ఉంది.కోస్తాలో నీళ్ళు ఫరవాలేదు గాని,ఈ రోజుల్లో వ్యవసాయములో ఆదాయమూ చాలా తక్కువ వస్తుంది. కరువు,వరదలు లేకపోతే ఒక సామన్య రైతుకు ఎకరానికి సంవత్సరానికి 30వేలు వస్తే ,ఒక ఐ.టీ లో పని చేసే వారికి నెలకు 30 వేలు వస్తాయి. కోస్తా జిల్లాలు పచ్చగా కనపడతాయి అంతే .పరిశ్రమలు లేవు. పర్యావరణాన్ని పాడుచేసే పరిశ్రమల కన్నా వ్యవసాయ పరిశ్రమలు అక్కడ పెట్టాలి.

కోస్తావాళ్ళు కూడా వేరే ప్రాంతములు, దేశములు ఉద్యోగములు,వ్యాపారముల కోసము ఎందుకు వెళ్తారో నాకు అర్ధము కాదు. వారి ప్రాంతము అభివ్రుద్ది చేశుకోవచ్చు కదా... మాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతములలో బంధువులు ఉన్నారు.... ..

ప్రజలు పర్యావరణానికి హాని లేకుండా అభివ్రుద్ది కోరుకోవాలి. సౌరశక్తి,ఎరువులుపాతకాలపు పద్దతులలో చేసుకోవటము,, లేకపోతే మన ఆశలకు మన పిల్లలే బలి అవుతారు.

అన్ని ప్రాంతములు నీళ్ళు,మంచి సౌభాగ్యముతో సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాను.మనలాగే చెట్లు,జంతువులకు కూడా ఈ భూమిమీద మనలానే సమాన హక్కులు ఉన్నాయి. వాటిని బ్రతకనిద్దాము.


ఇక రాష్ట్రము విడిపోవాలా..లేక కలిసి ఉండాలో చేప్పే ధైర్యము నాకు లేదు. కాని ఆ తరువాత దాని పరిణామము తప్పక దేశము మీద ఉంటుంది.

దేశములో సంపద కొంతమంది దగ్గర మాత్రమే కాకుండా అందరికి సమానముగా సంపద ఉంటే ఎంతో బాగుంటుంది. ఇలాగొడవలు రావు. అభివృద్ధి లేకపోవటానికి ఇది ఒక పెద్ద కారణము....